వాళ్లిద్దరూ ప్రేమించుకున్నారు. వాళ్ల దగ్గర డబ్బుల్లేవు. కానీ ప్రేమ ఉంది. తలో పని చేసుకుని బతుకుదామని… ప్రేమికుల రోజు నాడే పెళ్లి చేసుకున్నారు. కానీ ఇద్దరూ చెరో రోజు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చింది. దానికి కారణం.. వారి మధ్య ప్రేమ తగ్గిపోయో.. ఆర్థిక సమస్యలు వచ్చో కాదు. ఫేస్బుక్ వల్ల. ఫేస్బుక్ పెట్టిన చిచ్చు వల్ల వారు ఆత్మహత్యలు చేసుకున్నారు.
తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి వాంబే కాలనీ లో చెక్కా బిందు అనే యువతికి తండ్రి లేడు. తల్లితో కలసి ఉంటూ.. బ్యూటిషియన్ కోర్సు నేర్చుకుని ఓ బ్యూటీ పార్లర్లో పని చేసుకుంటోంది. అదే ప్రాంతానికి సాయి అనే యువకుడ్ని ప్రేమించింది. ఇద్దరూ … ప్రేమికుల రోజునే పెళ్లి కూడా చేసుకున్నారు. కొద్ది రోజులు అన్యోన్యంగా ఉన్నారు. అయితే వారి చేతుల్లోకి కొత్తగా వచ్చిన స్మార్ట్ ఫోన్.. జీవితాన్ని నాశనం చేస్తుందని ఊహించలేకపోయారు. బింద్ ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసుకున్న వెంటనే.. జంగారెడ్డి గూడెంకు చెందిన వెంకటేష్ అనే యువకుడు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. బిందు అమ్మమ్మది జంగారెడ్డి గూడెం కావడంతో.. ఫ్రెండ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసింది. ఆ తర్వాత చాటింగ్ కూడా ప్రారంభించింది. చివరికి వెంకటేష్ ఆమెను ప్రేమిస్తున్నట్లు చెప్పి వేధించడం ప్రారంభించాడు. తనకు పెళ్లయిందని చెప్పినా వినిపించుకోలేదు. చివరికి… వెంకటేష్ .. బిందు భర్త సాయికే ఫోన్ చేసి… బిందును వదిలేయాలని బెదిరించాడు. బిందు తనతో పెళ్లికి ఒప్పుకుందని… చెప్పుకొచ్చాడు. దాంతో మనస్తాపానికి గురైన సాయి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది జరిగి నెల రోజులైంది.
సోమవారం.. మళ్లీ.. బిందును.. వెంకటేష్ వేధించడం ప్రారంభించాడు. రాజమండ్రి రోడ్ కం రైల్వే వంతెన వద్దకు రావాలన్నాడు. అక్కడకు వెళ్లిన బిందుతో.. వెంకటేష.. మరింత వేధించేలా వ్యవహారించాడు. అప్పటికే.. తన వల్ల సాయి మరణించాడనే ఆవేదనలో ఉన్న బిందు… ఒక్క సారిగా వెంకటేష్ మీద ఫైరయిపోయింది. తీవ్రంగా ఏడ్చింది. నీ వల్లే సాయి చచ్చిపోయాడని రోదిస్తూ.. వంతెన పై నుంచి ఒక్కసారిగా గోదావరిలోకి దూకేసింది. ప్రాణాలు కోల్పోయింది.
అయితే బిందు మృతిపై అనుమానాలున్నాయని .. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదుచేసింది. అయితే ఫేస్బుక్ పరిచయంతో… ప్రేమికులను వేధించి వారి మరణానికి కారణమైన వెంకటేష్ తండ్రి పోలీసు శాఖలో ఉద్యోగి కావడంతో… న్యాయం జరగని.. బిందు తల్లి ఆవేదనతో ఉంది. కల్మషం లేకుండా ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న జంట.. సోషల్ మీడియా మోజులో పడి.. చివరికి ప్రాణాలు తీసుకోవడం.. రాజమండ్రి వాసుల్ని కన్నీరు పెట్టించింది.