జన్వాడ ఫామ్ హౌస్ కేసుకు సంబంధించి కేటీఆర్ బావమరిది రాజ్‌పాకాల దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. విచారణకు హాజరయ్యేందుకు రాజ్‌పాకాలకు 2 రోజుల సమయం ఇవ్వాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది.తనను అక్రమంగా అరెస్టు చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రాజ్ పాకాల హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. అయితే పోలీసులు కేవలం నోటీసులు మాత్రమే జారీ చేశారని అరెస్టులు లాంటివేమీ చేయడం లేదన్నారు.
ఆధారాలు లభిస్తే చర్యలు తీసుకుంటామని పోలీసుల తరఫున ఏఏజీ కోర్టుకు తెలపారు. నిబంధనల ప్రకారమే ముందుకు వెళ్లాలని న్యాయస్థానం సూచించింది. పోలీసుల ఎదుట హాజరయ్యేందుకు రెండు రోజుల సమయం లభించడంతో ఆ తర్వాతే ఆయన పోలీసుల ఎదుట హాజరయ్యే అవకాశం ఉంది. అయితే అరెస్టు నుంచి ఊరట లభించలేదు. నిజానికి ఆయనను అరెస్టు చేస్తారని అనుకోలేదు.కానీ ఆయన పారిపోవడం.. ఆయనే తనకు డ్రగ్స్ ఇచ్చాడని కొకైన్ పాజిటివ్ గా తేలిన విజయ్ మద్దూరి చెప్పడంతో ఆయనను ఏ వన్ గా చేర్చి ఎన్‌డీపీఏ కేసు పెట్టారు.
దీంతో అరెస్టు చేస్తారన్న భయంతో రాజ్ పాపకాల ఆజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అరెస్టు నుంచి రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. రాజ్ పాకాల పోలీసుల ఎదుట విచారణకు హాజరయ్యే వరకూ ఈ కేసులో పెద్దగా అప్ డేట్స్ ఏమీ ఉండవని అనుకోవచ్చు. రాజకీయంగా ఈ కేసుపై వాదోపవాదాలు జరుగుతూనే ఉన్నాయి.