మార్గదర్శి ఆస్తుల జప్తు విషయంలో సీఐడీకి గట్టిగా మొట్టికాయలు వేసింది గుంటూరు జిల్లా కోర్టు . ఆస్తులు జప్తు చేస్తూ… ప్రభుత్వం ఇచ్చిన మూడు జీవోలు చెల్లవని స్పష్టం చేసింది. మార్గదర్శిలో ఖాతాదారుల ప్రయోజనాలకు ఎక్కడా భంగం కలగలేదని ..జప్తు చేయదగిన కారణాలు లేవని కోర్టు స్పష్టంచేశారు. మూడు రకాల ఆస్తుల జప్తును తప్పు పట్టింది. మార్గదర్శిపై సీఐడీని అడ్డం పెట్టుకుని జరిపిన ప్రభుత్వం జరిపిన వ్యవస్థీకృత దాడిలో ఉన్న కుట్ర కోణాలన్నీ తేలిపోయినట్లయింది.
ఒక్క ఖాతాదారు నుంచి పిర్యాదు లేకుండానే జగన్ రెడ్డి సర్వీసులో నిండా మునిగిన సీఐడీ అధికారులు ఇష్టారీతిన వ్యవహరించారు. అడ్డగోలు కేసులతో వేధించారు. చివరికి ఆస్తులు జప్తు చేశారు. అసలు ఎందుకు ఆస్తులు జప్తు చేశారో కూడా వారికి తెలియదు. ఒక్క కస్టమర్ కూడా తమకు డబ్బులు రాలేదని ఫిర్యాదు చేయలేదు. ఓ వ్యాపార సంస్థపై ఇలా దాడి చేయడం అధికార దుర్వినియోగం చేయడమే. అయినా ఫలితం ఏదైనా ముందు వేధించవచ్చు కదా అన్నట్లుగా చెలరేగిపోతున్నాయి.
ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు పెట్టి, ఆస్తులు జప్తు అని వేధించే సీఐడీపై ఎలాంటి చర్యలు తీసకోవాలన్నది ఇప్పుడు ప్రజలకు వచ్చే సందేహం. ఒక్క మార్గదర్శి విషయంలోనే కాదు.. ఇతర రాజకీయ పరమైన కేసుల్లోనూ అదే పంథా. అనుసరిస్తున్నారు. ఒక్క రూపాయి అవినీతికి ఆధారాలు చూపించకుండా ఆస్తుల జప్తు అంటూ జీవోలు జారీ చేయిస్తున్నారు. దీని వెనుక భారీ కుట్రలు ఉన్నాయని మొత్తం బయటకు తెస్తామని టీడీపీ నేతలు చెబుతున్నారు.