పాకిస్థాన్ మాజీ సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్‌కు అక్కడి కోర్డు మరణశిక్ష విధించింది. దానిపై పాకిస్తాన్లో వాదోపవాదాలు జరుగుతున్నాయి. అది అక్కడి రాజకీయం. కానీ ముషారఫ్‌కు అక్కడి కోర్టు వేసిన శిక్ష.. అందులో ప్రత్యేకంగా ఉన్న అంశాలు చూస్తే… అలా కూడా తీర్పు ఇస్తారా.. అన్న ఆశ్చర్యం కలగకమానదు. ఎందుకంటే.. మరణశిక్ష అమలు చేయక ముందే ఒక వేళ ముషారఫ్ మరణిస్తే… ఆయన శవాన్ని… పార్లమెంట్‌కు ఈడ్చుకురావాలి కోర్టు తీర్పులో పేర్కొన్నారు. పార్లమెంట్ బయట 3 రోజుల పాటు ముషారఫ్ డెడ్ బాడీని వేలాడదీయాలని పాక్ కోర్టు న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
ఈ తీర్పు ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ముషారఫ్ ప్రస్తుతం దుబాయ్ లో తలదాచుకుంటున్నారు. తనకు మరణశిక్ష విధించడం అన్యాయమని ఆయన తన వాదన బయట వినిపిస్తున్నారు. ఆయనకు మద్దతుగా సైన్యం తెర మీదకు వచ్చింది. ముషారఫ్.. తన జీవితం మొత్తం.. దేశం కోసం శ్రమించారని.. అలాంటి వ్యక్తి ఎప్పటికీ దేశద్రోహి కాబోడని… ప్రకటించింది. ముషారఫ్‌కు మద్దతుగా పాకిస్థాన్‌లో పలు చోట్ల నిరసనలు కూడా జరుగుతున్నాయి. పాకిస్థాన్ లో న్యాయవ్యవస్థ ఇలాగే ఉంటుంది. వ్యక్తిగత కక్షలతో తీర్పులు ఇస్తున్నట్లుగా ఉంటుంది.
నవాజ్ షరీఫ్‌కు ఎన్నికల ముందు… శిక్ష విధించారు. విదేశాల్లో ఉన్న ఆయన స్వదేశానికి రాకుండా చేయాలనే ఆ తీర్పు ఇచ్చారని చెప్పుకున్నారు. నవాజ్ పాకిస్తాన్ వచ్చారు. అరెస్టయ్యారు. ఇప్పుడు ముషారఫ్ కు కోర్టు మరణశిక్ష విధించింది. అది కూడా.. శవాన్ని పార్లమెంట్ కు వేలాడదీయాలన్నంత కసితో..!