వైసీపీ పెద్దల క్రిమినల్ ఆలోచనల్ని అమలు చేసేందుకు అత్యుత్సాహం చూపే సివిల్ సర్వీస్ అధికారులకు మొదట్లో బాగానే ఉంటుంది కానీ.. తర్వాత మాత్రమే అసలు సినిమా కనిపిస్తూ ఉంటుంది. గతంలోనే చాలా మంది జైలుకు వెళ్లారు. తర్వాత ప్రభుత్వం మారితే ఎంత మంది వెళ్లాల్సి వస్తుందో కానీ… ప్రభుత్వం మారక ముందే కోర్టుల ముందుకు తప్పు చేసినట్లుగా నిలబడాల్సి వస్తోంది . ఏపీ హైకోర్టులో ప్రభుత్వంలోని ప్రతి కీలక అధికారి కోర్టు ధిక్కరణ శిక్షను ఎదుర్కొన్నారు. ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ముందు సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ నిలబడాల్సి వస్తోంది.
మార్గదర్శి విషయంలో పెడుతున్న ప్రెస్ మీట్లకు సంబంధించి హైకోర్టు ఎన్ సంజయ్ కు వ్యక్తిగతంగా కూడా హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అసలు కేసు దర్యాప్తు చేస్తూ… లేనిపోనివి కల్పించి ప్రెస్మీట్లలో చెబుతున్నారని.. మార్గదర్శి హైకోర్టును ఆశ్రయించింది. దర్యాప్తు వదిలేసి ప్రెస్ మీట్లుపెట్టడం ఏమిటని. హైకోర్టు సీఐడీకి నోటీసులు జారీ చేసింది. ఈ సందర్భంగా ప్రభుత్వ న్యాయవాది… ప్రెస్ మీట్లలో అన్నీ చెప్పడం లేదని వాదించబోగా న్యాయమూర్తి తాము కూడా పత్రికలు చదువుతామని.. చెప్పడంతో సైలెంట్ అయ్యారు.
సీఐడీ చీఫ్ ఎన్ సంజయ్ వ్యవహారశైలి పోలీసు వర్గాల్లోనూ చర్చనీయాంశమవుతోంది. పీవీ సునీల్ కుమార్ తరహాలో ఈయన కూడా పూర్తి స్థాయిలో క్రైస్తవ ప్రచారంలో ఉన్నారు. ఆయన క్రీస్తు పాటలు పాడటానికి ఉత్సాహం చూపిస్తారు. ఆయన వీడియోలు వందల సంఖ్యలో యూ ట్యూబ్ లో ఉన్నాయి. విధి నిర్వహణ కన్నా క్రీస్తు చింతన కోసమే ఎక్కువ సమయం కేటాయిస్తారన్న ప్రచారం ఉంది. ఆయనను ముందు పెట్టుకుని ప్రభుత్వపెద్దలు మార్గదర్శిపై కక్ష సాధిస్తున్నారని… ఆయన అడ్డంగా ఇరుక్కుపోయే పరిస్థితి ఉందన్న అభిప్రాయం నిపుణుల్లో వినిపిస్తోంది.