ఆక్సిజన్.. ఆక్సిజన్.. ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అంశమే కాదు..మోస్ట్ వాంటెడ్ ఐటమ్కు కూడా ఇదే నిలుస్తోంది. ఆక్సిజన్ లేక పోతున్నప్రాణాలు అని.. ఏ రాష్ట్రంలో చూసినా వార్తలు వినిపిస్తున్నాయి. చాలా రాష్ట్రాలు ఆక్సిజన్ లేక చనిపోయిన వారి లిస్టును ప్రకటించడం లేదు. కరోనా తీవ్రమై చనిపోతున్నారని చెబుతున్నారు. ఆ సీరియస్ నెస్‌ను న్యాయస్థానాలే… తీసుకుంటున్నాయి. సుప్రీంకోర్టు నుంచి రాష్ట్రాల హైకోర్టుల వరకూ.. అన్ని ఉన్నత న్యాయస్థానాలు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నాయి. ఢిల్లీకి తగినంత ఆక్సిజన్ అందించడంలో కేంద్రం ఎప్పటికప్పుడు విఫలమవుతోంది. ఫలితంగా.. ఆస్పత్రుల్లో మరణాలు పెద్ద ఎత్తున చోటు చేసుకుంటున్నాయి. ఈ అంశంపై దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది.
డిల్లీకి ఎంత ఆక్సిజన్ కావాలో.. అంత సరఫరా చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని.. ఈ అంశంపై… ఢిల్లీకి ఎంత ఆక్సిజన్ డిమాండ్ ఉంది.. ఎంత సరఫరా చేస్తునారో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. ఇక రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి. తెలుగు రాష్ట్రాల్లో హైకోర్టులు.. తీవ్ర స్థాయిలో ప్రభుత్వాలపై విరుచుకుపడుతున్నాయి. తెలంగాణలో ఆక్సిజన్ ఎంత డిమాండ్ ఉందని.. కేంద్రం ఎంత ఇచ్చిందని హైకోర్టు ప్రశ్నించారు. 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ డిమాండ్ ఉంది .. కేంద్రం 430 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఇచ్చిందని ప్రభుత్వం హైకోర్టుకు తెలిపింది. అయితే ఇతర రాష్ట్రాల నుంచి ఆక్సిజన్ తెప్పించి ఇస్తున్నామని.. ఇబ్బంది లేదని తెలిపింది.
దీంతో తెలంగాణకు 600 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ అందించాలని కేంద్రానికి హైకోర్టు సూచించింది. ఏపీ హైకోర్టు కూడా.. ఆక్సిజన్ సరఫరాపై పూర్తి వివరాలను సమర్పించాలని ఏపీ సర్కార్ ను ఆదేశించింది. కేసులు పెరుగదలకు తగ్గట్లుగా… చికిత్స సౌకర్యాలు పెంచుకోవడం.. సన్నద్ధదతపై ప్రశ్నించింది. మొత్తంగా చూస్తే.. ప్రజల ఆయువును కాపాడేందుకు న్యాయస్థానాలే నడుం కట్టాయి. ప్రభుత్వాలు నిర్లిప్తంగా ఉంటూండటంతో.. న్యాయస్థానాలు చురుకుగా మారక తప్పడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో చూస్తూ ఉండలేమని కొద్ది రోజుల కిందట.. సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.