దేశంలో పలు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయింది. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం కరోనా కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత ఇరవై నాలుగు గంటల్లో ఏపీలో కొత్తగా 3,224 కరోనా కేసులు మాత్రమే నమోదయ్యాయి. కేసుల పరంగా చూస్తే ఎక్కువే అయినప్పటికీ క్రమంగా తగ్గుతూ రావడం మాత్రం ఏపీలో వైరస్ వ్యాప్తి తగ్గుతున్న సూచనలు కనిపించడానికి కారణం అంటున్నారు. ప్రస్తుతానిక ఏపీలో ప్రస్తుతం 43,983 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ఏడు లక్షల మందికిపైగా రికవర్ అయ్యారు.
దేశంలో ఇప్పటికీఏపీ రెండో స్థానంలో ఉంది. మొత్తం కేసుల్లో ఏపీది రెండో స్థానం. మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉంది. మొదట్లో కరోనా వైరస్ను సమర్థంగా ఎదుర్కొన్న కేరళలో ప్రస్తుతం ఆ వైరస్ విలయం సృష్టిస్తోంది. సెకండ్ వేవ్ ప్రారంభమైనట్లుగా భావిస్తున్నారు. రోజుకు పదివేల కేసులు నమోదవుతున్నాయి. ప్రస్తుతం అన్ లాక్ నిబంధనలు ప్రకటించారు. కంటైన్మెంట్ జోన్లు తప్ప.. ఎక్కడా నిబంధనలు పెట్టలేదు. నిజానికి కంటెయిన్మెంట్ జోన్లను కూడా పట్టించుకోవడం లేదు.
ఈ క్రమంలో కరోనా కేసుల సంఖ్య భారీగా పెరిగే ప్రమాదం ఉంది. అయితే సీరో సర్వైలెన్స్ సర్వేల్లో… పాతిక శాతం మందికి ఇప్పటికే కరోనా వచ్చిపోయిందని తేలడం.. దేశంలో సగం మందికి యంటీ బాడీస్ ఉన్నాయని అంచనాల నేపధ్యంలో వైరస్ను అందరూ తేలిగ్గా తీసుకుంటున్నారు. ఇక మాస్క్లు మాత్రం అందరి జీవితాల్లో భాగం అవుతున్నాయి. ఇక నుంచి ప్రభుత్వాలు టెస్టుల సంఖ్యను తగ్గించే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు.