మే ఒకటో తేదీ నుంచి టీకాలను పద్దెనిమిది ఏళ్లు నిండిన వారందరికీ ఇవ్వబోతున్నట్లుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రకటించారు. అయితే ఏ ఒక్కరికీ ఉచితంగా ఇవ్వబోవడం లేదు. డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. టీకా ఉత్పత్తి సంస్థలకు యాభై శాతం బహిరంగమార్కెట్లో అమ్ముకునేందుకు చాన్సిచ్చారు. యాభై శాతం ప్రభుత్వానికి సరఫరా చేయాలి. ఇప్పుడు యాభై శాతాన్ని టీకా ఉత్పత్తి సంస్థలు బహిరంగ మార్కెట్లో అమ్మబోతున్నాయి. అంటే ఒకటో తేదీ నుంచి ప్రైవేటు ఆస్పత్రుల్లో టీకా దందా ప్రారంభం కాబోతోందన్నమాట.
నిజానికి టీకాలు ఇప్పటి వరకు ఉచితంగా ఇస్తున్నారు. నలభై ఐదేళ్లు పైబడిన వారికి ఇస్తున్నారు. అవన్నీ ఉచితమే. ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇస్తున్నారు. అది కూడా ఒక్క డోస్‌కు చాలా తక్కువగా రూ. రెండు వందల యాభైకే ఇస్తున్నారు. దీంతో ప్రజలకు పెద్ద భారం అనిపించలేదు. కానీ మే ఒకటి నుంచి ఇవ్వబోయే వ్యాక్సిన్లు .. రూ. రెండు వందల యాభై మాత్రమే ఉంటుందన్న గ్యారంటీలేదు. అలా ఉంటుందని ప్రభుత్వం కూడా చెప్పడం లేదు. టీకాల కొరత తీర్చడానికి విదేశీ టీకాలకు అనుమతి ఇస్తున్నారు. వాటి ధరలు చాలా ఎక్కువ ఉండనున్నాయి. అందుకే పన్నులు తగ్గించి వీలైనంత వరకు చవకగా ఇప్పించేందుకు కేంద్రం ప్రయత్నిస్తోంది. ఎంత చేసినా… ఒక్క డోస్ టీకా .. వేయి దాటిపోతుందన్న ప్రచారం ఉంది.
టీకాలు ప్రైవేటు విపణిలోకి వెళ్తే.. ప్రస్తుతం రెమిడెసివిర్ ఇంజెక్షన్లు బ్లాక్ మార్కెట్‌కు వెళ్లిపోయినట్లు వెళ్లిపోతాయి. అసలు ప్రభుత్వం ధర ఎంత నిర్ణయించినా.. అమ్మే రేటు వేరుగా ఉంటుంది. ఎందుకంటే.. దేశంలో ప్రస్తుతం… వ్యవస్థలేమీ రెగ్యులేట్ చేసే పరిస్థితుల్లో లేవు. అలాంటి పరిస్థితే ఉండి. రెమిడెసివిల్ లాంటి యాంటీ వైరల్ డ్రగ్స్ కోసం… బ్లాక్ మార్కెట్ ఏర్పడే అవకాశం లేదు. ఎలా చూసినా.. ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ ఫ్రీ కాదు.. అందరూ కొనుగోలు చేయాల్సిందే.