సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థం.. దుబాయ్‌లో సూపర్ లగ్జరీ ఈవెంట్‌గా జరుగుతోంది. ఈ కార్యక్రమానికి తెలుగు రాష్ట్రాలకు చెందిన అనేక మంది ముఖ్యులు హాజరయ్యేందుకు వెళ్లారు. ఎవరెవరు వెళ్లారన్నదానిపై క్లారిటీ లేదు. కానీ.. సీపీఐ జాతీయ నాయకుడు నారాయణ మాత్రం.. భిన్నమైన కోణాన్ని ఆవిష్కరించారు. సీఎం రమేష్ కుమారుడి నిశ్చితార్థ వేడుక ఒక్కటే అక్కడ జరగడం లేదని.. అంతకు మించి జరుగుతోందని అంటున్నారు. అంతకు మించి ఏమిటంటే… అక్కడ.. “ఆపరేషన్ ఆకర్ష్” నడుస్తోందట..!. వైసీపీకి చెందిన పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు.. టీడీపీకి చెందిన ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున దుబాయ్ వెళ్లారని.. వారంద్నీ ఆకర్షించేందుకు.. తమ పార్టీలో చేర్చుకునేందుకు అక్కడ చర్చలు జరుగుతున్నాయంటున్నారు.
సీఎం రమేష్ …అమెరికాకు చెందిన ఓ డాక్టర్ కుమార్తెతో.. తన కుమారుడి పెళ్లిని నిశ్చయం చేశారు. నిశ్చితార్థాన్ని అటు అమెరికాలో.. ఇటు ఇండియాలో కాకుండా.. దుబాయ్ లో ఏర్పాటు చేశారు. అతిధులందర్నీ.. ప్రత్యేక విమానాల్లో దుబాయ్ కు తీసుకెళ్తాన్నారు. సహజంగా.. సీఎం రమేష్.. రాజకీయంగా కీలకమైన వ్యక్తి కావడంతో.. ఆయన అతిధుల జాబితాలో… అందరూ రాజకీయ నేతలే ఉంటారు. అయితే.. అనూహ్యంగా.. ఆయన కుమారుడి నిశ్చితార్థానికి వెళ్లిన వారిలో.. వైసీపీ నేతలే ఎక్కువగా ఉన్నారు. అదే.. ఊహాగానాలకు కారణం అవుతోంది. పది మంది వరకూ ఎంపీలు.. పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు దుబాయ్ వెళ్లిన వారి జాబితాలో ఉన్నారంటున్నారు.
ఈ ఊహాగానాలకు.. సీపీఐ నారాయణ.. మరింత ఆజ్యం పోస్తున్నారు. సీఎం రమేష్.. ఆపరేషన్ ఆకర్ష్‌కు పాల్పడుతున్నారని.. అంటున్నారు. ఇప్పటికే.. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. తన ఎంపీలపై..అపనమ్మకాన్ని పెంచుకున్నారు. సుజనా చౌదరి… “టచ్” కామెంట్ల తర్వాత ఆ పార్టీలో మరింత గందరగోళం ఏర్పడింది. తాజా పరిస్థితులు దీన్ని పెంచేలా ఉన్నాయి.