నాగార్జునకు పరువు లేదని ఆయన పరువు నష్టం పిటిషన్ దాఖలు చేయడానికి అనర్హుడని సీపీఐ సీనియర్ నేత నారాయణ తేల్చారు. సమంతకు ఆ హక్కు ఉందని ఆయన చెబుతున్నారు. నాగార్జునకు పరువు ఎందుకు లేదంటే.. ఆయన బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉంటూ పరువు మొత్తం పోగొట్టుకున్నాడని నారాయణ చెబుతున్నారు. నారాయణ బిగ్ బాస్ షోపై వ్యతిరేకత చూపడం ఇదే మొదటి సారి కాదు. కోర్టులకు కూడా వెళ్లారు. బిగ్ బాస్ షోకు హోస్ట్ గా ఉన్నందున నాగార్జునకు పరువు లేదని అంటున్నారు.
తన కుటుంబంపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలకు మొత్తం అక్కినేని కుటుంబం తల్లిఢిల్లి పోయింది. రూ. వంద కోట్లకు పరువు నష్టం దావా వేసి ఇంటిల్లిపాది కోర్టులో వాంగ్మూలం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. కొంత మంది వాంగ్మూలాలు కోర్టులో నమోదు చేశారు. అయితే సమంత మాత్రం ఎలాంటి న్యాయపరమైన చర్యలు తీసుకోలేదు. నిజానికి కొండా సురేఖ సమంతను పొగిడారని .. నాగార్జున కుటుంబాన్ని మాత్రమే విమర్శించారన్న వాదన ఉంది.
సీపీఐ నేత నారాయణ.. బిగ్ బాస్ పై వ్యతిరేకతతో నాగార్జునపై ఇలా మాట్లాడుతున్నారా లేకపోతే.. నాగార్జునతో పాత గొడవలు ఏమైనా ఉన్నాయేమో కానీ.. ఆయనను చాన్స్ వచ్చినప్పుడల్లా టార్గెట్ చేస్తున్నారు. ఇప్పుడు నాగార్జున మరీ బాధలో ఉంటే నారాయణ ఆయనపై మరిన్ని రాళ్లేస్తున్నారు.