మూడు రాజధానులను పెట్టాలంటే.. ఎట్టి పరిస్థితుల్లోనూ… ఎన్నికలకు వెళ్లి ..మళ్లీ గెలిచి.. ఆ పని చేయాలని.. సీపీఐ నారాయణ.. ఓ స్థాయి పోరాటమే చేస్తున్నారు. ఆయన విమర్శల్లో .. మొట్టమొదటగా.. జగన్మోహన్ రెడ్డి రాజీనామానే ఉంటోంది. రాజధానిని మార్చబోనని ఎన్నికల్లో ప్రచారం చేసి.. ఇప్పుడు రాజధానిని మారుస్తూ.. ప్రజల్ని మోసం చేస్తున్నారనేది ఆయన భావన. అందుకే.. ముందుగా.. రాజీనామా చేసి.. మూడు రాజధానుల అంశమే ఎజెండాగా మళ్లీ ఎన్నికలకు వెళ్లాలని.. నారాయణ డిమాండ్ చేస్తున్నారు. అమరావతిలో అదే మాట చెబుతున్నారు. విశాఖ వెళ్లి అదే మాట అంటున్నారు. రాయలసీమ వెళ్లి కూడా నారాయణ అదే మాట చెబుతున్నారు.
తెలుగుదేశం పార్టీ నేతల కంటే.. అగ్రెసివ్‌గా నారాయణ.. రాజధాని ఉద్యమాన్ని తలకెత్తుకున్నారు.. సీపీఐ సీనియర్ నేత నారాయణ. గత ఐదేళ్ల కాలంలో.. ఇలాంటి ప్రజాఉద్యమాలు చేసే అవకాశం.. కమ్యూనిస్టులకు పెద్దగా దొరకలేదు. ప్రత్యేకహోదా లాంటి అంశాలపై పోరాటాలు చేసినప్పటికీ.. అవి.. కమ్యూనిస్టుల మార్క్ కాదు. భూపోరాటాలు.. రైతులు.. విద్యార్థుల సమస్యలపై.. పోరాటలే.. కమ్యూనిస్టుల బ్రాండ్. ఆ అవకాశం చాలా రోజుల తర్వాత కమ్యూనిస్టులకు వచ్చింది. దీన్ని సమర్థంగా చేజిక్కించుకుని ముందడుగు వేస్తున్నారు సీపీఐ నారాయణ. నిజానికి మంగళగిరిలో సీపీఐకి.. కొంత క్యాడర్ ఉంది. కానీ ఇటీవలి కాలంలో నిస్తేజంగా ఉంది. వారందర్నీ ఇప్పుడు.. తమకు మాత్రమే సాధ్యమైన పోరాటాలకు సిద్ధం చేయడంలో సక్సెస్ అయ్యారు నారాయణ.
ఆయన ఎగ్రెసివ్‌గా.. మళ్లీ ఎన్నికలకు వెళ్లాలనే డిమాండ్ ను నారాయణ వినిపిస్తూండటంతో.. ఇతర పార్టీల నేతలు కూడా అదే ఫాలో అవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కూడా.. మళ్లీ ఎన్నికల్లో గెలిచి.. ఆ తర్వాత రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అమరావతి రైతులు కూడా ఇదే డిమాండ్ వినిపిస్తున్నారు. అమరావతికి మద్దతు పెరిగే కొద్దీ.. ఈ డిమాండ్ కూడా పెరిగే అవకాశం ఉంది. ఓ రకంగా.. ప్రభుత్వానికి ఇబ్బందికరమయ్యే డిమాండ్‌నే..నారాయణ చాలా పకడ్బందీగా.. ప్రజల్లోకి చొప్పిస్తున్నారు.