మాజీ ఎంపీ, మాజీ సీఎం జగన్ కు సన్నిహిత నేతగా ఉన్న నందిగం సురేష్ కు సీఆర్డీయే నోటీసులు పంపింది. రాజధాని ప్రాంతంలోని ఉద్దండరాయునిపాలెంలో నందిగం సురేశ్‌కు చెందిన భవనానికి అనుమతులు లేవని, అక్రమ నిర్మాణమని నోటీసుల్లో పేర్కొంది.
ఇది సీఆర్డీయే రూల్స్ ప్రకారం అక్రమ నిర్మాణం… ఒకవేళ మీ దగ్గర అనుమతులకు సంబంధించిన వివరాలుంటే అందించాలని, నోటీసులపై వారం రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. లేదంటే చట్టప్రకారం చర్యలుంటాయని హెచ్చరించారు. ఈ బిల్డింగ్ అమరావతి పరిధిలో ఉన్నందున సీఆర్డీఏతో పాటు ఉద్దండరాయునిపాలెం పంచాయతీ అధికారులు సంయుక్తంగా నోటీసులు ఇచ్చారు.
మరోవైపు నందిగం సురేష్ సోదరుడు ప్రభుదాస్ అక్రమ ఇసుక రవాణా కేసులో ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ఉద్దండరాయునిపాలెం నుంచి విజయవాడకు అక్రమంగా ఇసుకను తరలిస్తున్న రెండు లారీలను పట్టుకోగా, అవి ప్రభుదాస్‌కు చెందినవిగా తేలింది.
అయితే, వీటిపై నందిగం సురేష్ ఇంతవరకు స్పందించలేదు.