తమిళనాడులో బీజేపీ పరిస్థితి అంతంతమాత్రమే. కానీ వారి అహంకారానికి మాత్రం అడ్డూ అదుపూ ఉండదు. తాజాగా ఓ హోటల్ వ్యాపారిపై బీజేపీ నేతలు చూపిన అహంకారంతో.. మరోసారి బీజేపీకి సెగ తగులుతోంది. దీనంతటికి కారణం క్రీమ్ బన్ను.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇటీవల కోయంబత్తూరులో హోటాల్ వ్యాపారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఓ హోటల్ వ్యాపారి .. జీఎస్టీ గురించి చెప్పారు. బన్ను మీద పన్ను లేదు కానీ.. క్రీమ్ బన్ను మీద పద్దెనిమిది శాతం పన్నేస్తున్నారని చెప్పారు. అలాగే హోటల్స్ లో అమ్మే ఆహార పదార్థలపై జీఎస్టీ రేట్లపై ఆయన చెప్పిన విధానంతో అక్కడున్న వారంతా నవ్వారు. ఆ వీడియో వైరల్ అయింది. అది బీజేపీ నేతలకు మంట పుట్టించుదేమో కానీ తర్వాత బెదిరించి మరీ ఆ హోటల్ వ్యాపారిని తీసుకెళ్లి.. నిర్మలమ్మకు క్షమాపణ చెప్పించారు. ఈ వీడియోను కూడా సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
బీజేపీ నేతల అహంకారంపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది , దీంతో క్రీమ్ బన్నును వైరల్ చేస్తున్నారు. అలా క్షమాపణలు చెప్పిన హోటల్ వ్యాపారి ..కోయంబత్తూరు హోటళ్ల సంఘానికి అధ్యక్షుడు. ఆయనకు వందకుపైగా హోటళ్లు ఉన్నాయి. ఆయనను అవమానించడాన్ని ఎక్కువ మంది తప్పు పడుతున్నారు. దీన్ని సమర్థించుకోవడానికి తమిళనాడు అన్నామలై కూడా తంటాలు పడుతున్నారు. మొత్తంగా తమిళనాట.. క్రీమ్ బన్ను బీజేపీకి సెగ పుట్టిస్తోంది.