” గాయత్రీ .. నిన్ను ఎంతగా ప్రేమించానో నీకు తెలుసు. కానీ నువ్వు నన్ను ఎంతగా బాధపెట్టావో నీకు తెలుసు” ఇది గురువారెడ్డి అనే యువకుడు.. ఆత్మహత్య చేసుకోబోయే ముందు చివరిగా చెప్పిన మాట. ఈ గాయత్రి ఎవరో కాదు… గురవారెడ్డి భార్యే. పెళ్లి చేసుకుని నెలలు గడవక ముందే.. భార్యను అత్యంత ప్రేమతో చూసుకునే గురువారెడ్డి మరణానికి ఆ భార్యే కారణం అయింది. భర్త ప్రేమ తనకు సరిపోదని… ఇతరుల ప్రేమ కోసం ఆరాటపడటమే గాయత్రి చేసిన తప్పు. ఆ తప్పును కప్పి పుచ్చుకోవడానికి తప్పు మీద తప్పు చేస్తూ.. చివరికి భర్త ఆత్మహత్యకు కారణం అయింది గాయత్రి. ఇందులో ఆమె తల్లిదండ్రులది.. అంటే గురువారెడ్డి అత్తమామలదీ కీలకపాత్రే.
విజయవాడ రైల్వే స్టేషన్లో గురువారెడ్డి అనే యువకుడు సెల్ఫీ వీడియో తీసుకుని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు భార్య అత్తా, మామలే కారణమని సెల్ఫీ వీడియోలో గురువారెడ్డి స్పష్టంగా పేర్కొన్నారు. భార్యతో పాటు అత్తా, మామ తనపై అక్రమ కేసు బనాయించారని ఆవేదన వ్యక్తం చేశారు. తన వాదన వినకుండా.. కృష్ణలంక పోలీసులు పిలిపించి కొట్టారని .. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. ఈ ఘటనపై పోలీసులు లోతుగా విచారణ జరిపించారు. దాంతో అనేక విషయాలు బయటపడ్డాయి.
మృతుడు గురువారెడ్డి, గాయత్రి అనే యువతికి ఇటీవలే వివాహమైంది. అయితే గాయత్రి… రహస్యంగా కార్తీక్ అనే యువకుడితో ప్రేమాయం నడుపుతోంది. పెళ్లికి ముందు నుంచి ఉన్న ప్రేమాయణం.. పెళ్లి తర్వాత కూడా కొనసాగించింది.ఈ విషయం గాయత్రీ తల్లిదండ్రులకు కూడా తెలుసు. ఓ సందర్భంలో గాయత్రి ఫోన్ చూసి తెలుసుకున్న గురువారెడ్డి.. కార్తీక్ తో ప్రేమాయణంపై… గాయత్రిని నిలదీశాడు. ప్రవర్తిన మార్చుకోమని నచ్చచెప్పాడు. ఆమె వినకపోయేసరికి తల్లిదండ్రుల వద్ల పంచాయతీ పెట్టాడు.
కానీ గాయత్రి తల్లిదండ్రులు.. రివర్స్ లో .. గురువారెడ్డినే బెదిరించారు. గురువారెడ్డిని భయపెట్టడానికి ఆత్మహత్యాయత్నం చేసినట్లు నటించారు. దీంతో విషయం పోలీస్ స్టేషన్ కు చేరింది. పెద్దవాళ్లిద్దరూ ఆత్మహత్యయత్నం చేయడంతో పాటు .. అల్లుడే కారణమన్నట్లు వారు పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు. దీంతో గురువారెడ్డిని పోలీస్ స్టేషన్ కు పిలిపించారు. పోలీస్ మార్క్ ట్రీట్ మెంట్ రుచి చూపించారు. ప్రాణంగా ప్రేమించిన భార్య మోసం చేయడం… తన తప్పేం లేకపోయినా… పోలీస్ స్టేషన్ కు పిలిపించారని మథనపడిన గురువారెడ్డి.. సెల్పీ వీడియో తీసుకుని ప్రాణాలు తీసుకున్నాడు.