మరో తెలుగు న్యూస్ చానల్ సంక్షోభంలో కూరుకుపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత ఏపీలో విజయవాడ కేంద్రంగా.. తొలి సారి AP 24X7 అనే చానల్ ప్రారంభమయింది. గతంలో మా టీవీని ప్రారంభించి..ఆ తర్వాత నిమ్మగడ్డకు అమ్మేసిన మురళీకృష్ణంరాజు ఈ చానల్‌కు చైర్మన్. మరికొంత మంది పెట్టుబడిదారులతో కలిసి ప్రారంభమైన ఈ చానల్.. కొన్నాళ్లుగా ఒడిదుడుకుల్లో ఉంది. తాజాగా.. ఈ చానల్ చైర్మన్ పదవికి తాను రాజీనామా చేస్తున్నట్లు మురళీకృష్ణంరాజు బహిరంగా ప్రకటన విడుదల చేశారు. ఇక నుంచి ఆ చానల్ కు తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. ఇప్పటి వరకూ.. ఉద్యోగులు.. సీఈవో లాంటి వాళ్లు రాజీనామాలు చేయడం చూశాం
కానీ తొలి సారి.. ఓనర్‌గా ఉండే.. చైర్మన్ రాజీనామా చేయడం… అదీ కూడా.. తాను పూర్తిగా విసిగిపోయానని లేఖలో చెప్పుకోవడం.. మీడియా వర్గాలను సైతం ఆశ్చర్య పరుస్తోంది. సంస్థలో సీనియర్ ఉద్యోగులు గొడవలు పడి.. పోలీస్ స్టేషన్ వరకూ వెళ్లారని.. అది తనను బాధించిందని.. మురళీకృష్ణంరాజు చెప్పుకుంటున్నారు. AP 24X7 చానల్ ప్రారంభోత్సవంలో.. వెంకటకృష్ణ అనే సీనియర్ జర్నలిస్టు … సాయి అనే మరో జర్నలిస్టు కీలకంగా ఉండేవారు. తర్వాత సాయి అనే జర్నలిస్టు బయటకు వెళ్లిపోయారు. తర్వాత ప్రభుత్వానికి వ్యతిరేకంగా చర్చలు నిర్వహిస్తున్నారని.. వెంకటకృష్ణ ను కూడా పక్కన పెట్టారనే ప్రచారం జరిగింది. ఆ తర్వాత మళ్లీ ఆయన స్క్రీన్ పైకి వస్తున్నారు.
ఉద్యోగుల మధ్య ఆధిపత్య పోరాటం.. ప్రొఫెనలిజం లేకపోవడం.. ఉద్యోగులంతా.. తమ తమ భావజాలల ప్రకారం.. వివిధ పార్టీలకు మద్దతుగా ఉండటంతో ఈ చానల్ పరిస్థితి దిగజారినట్లుగా కనిపిస్తోంది. చాలా కాలంగా నుంచి జీతాలివ్వలేకపోతున్నట్లుగా.. మురళీకృష్ణంరాజు తన లేఖలో పేర్కొనడాన్ని బట్టి చూస్తే.. ఆ చానల్ త్వరలో మూతపడినా ఆశ్చర్యం లేదన్న భావన మీడియా వర్గాల్లో ఉంది. అధికార పార్టీ నేతలు ఓన్ చేసుకుంటే బయటపడే అవకాశం ఉంది.