కర్ణాటకలో సంక్షోభం ముగింపు కోసం కుమారస్వామి పదవుల పంపకం.. ప్లాన్ వేశారు. మంత్రివర్గాన్ని మొత్తం రాజీనామా చేయించి.. అసంతృప్తులకు పదవులు ఇస్తామని సిగ్నల్స్ పంపారు. కాంగ్రెస్‌కు చెందిన 21 మంది… రాజీనామాలు చేశారు. జేడీఎస్ మంత్రులు కూడా రాజీనామాలు చేశారని కుమారస్వామి కార్యాలయం ప్రకటించింది. మరో వైపు క్యాంపు రాజకీయాలు జోరందుకున్నాయి. ఎవరికి వారు.. తమ మద్దతుదారుల్ని క్యాంపులకు పంపేశారు. అసలు ఈ సంక్షోభం సమసిపోయిందని… కుమారస్వామి చెబుతున్నా.. అసలు రాజకీయం మాత్రం.. ఇప్పుడే కాక మీద ఉందని తేలిపోతోంది. ఈ సంక్షోభం స్కెచ్ మొత్తం బీజేపీ అగ్రనేతల కనుసన్నల్లోనే జరిగిందని.. కాంగ్రెస్ నేతలు పక్కాగా చెబుతున్నారు. కర్నాటక సంక్షోభానికి వారం ముందు నుంచే బీజేపీ స్కెచ్ గీసిందంచున్నారు.
వారం కిందట జేడీఎస్ ఎమ్మెల్యే ఏహెచ్ విశ్వనాథ్ ఢిల్లీలో బీజేపీ నేతలను కలిశారు. ఆ తర్వాత విశ్వనాథ్ ఎవరికి అందుబాటులో లేరని.. ఈ టైమ్‌లోనే ఎమ్మెల్యేల రాజీనామాలకు స్కెచ్ గీశారని చెబుతున్నారు. అంతేకాదు.. రాజీనామాల తర్వాత రెబల్ ఎమ్మెల్యేలు వెంటనే ఎయిర్‌పోర్ట్‌కి చేరుకోవడం .. అక్కడి నుంచి ముంబై చేరడం వేగంగా జరిగిపోయాయి. రెబల్ ఎమ్మెల్యేలను తరలించిన ప్రత్యేక విమానం బీజేపీ ఎంపీ జీవ్ చంద్రశేఖర్‌కు చెందినది. ఇదంతా బీజేపీ అధ్యక్షుడు, హోంమంత్రి అమిత్ షా, యడ్యూరప్ప, రాజీవ్ చంద్రశేఖర్ ప్లానేననడానికి ఇంత కంటే ఆధారేలేముంటాయంటున్నారు. ఈ రోజు రాజీనామా చేసిన బీఎస్పీ ఎమ్మెల్యే కూడా..బీజేపీ క్యాంప్ కోసం ముంబై చేరురున్నారు.
అయితే బీజేపీ మాత్రం కాంగ్రెస్ ఆరోపణలను ఖండిస్తోంది. కర్నాటకలో జరుగుతున్న పరిణామాలతో తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ వివరణ ఇచ్చారు. తమ పార్టీ ఎక్కడా ఎమ్మెల్యేల కొనుగోళ్లకు పాల్పడటం లేదన్నారు.