కరోనాపై తెలుగు రాష్ట్రాలలోని ఎనిమిది జిల్లాలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని నిర్ణయించారు. తెలంగాణలో ఐదు, ఆంధ్రప్రదేశ్ లో మూడు జిల్లాలలో పరిస్ధితి అదుపులోకి తీసుకు రాగలిగితే మిగిలిన జిల్లాలలో అంత ప్రభావం ఉండదని ఇరు రాష్ట్రాల వైద్య శాఖకు చెందిన ఉన్నతాధికారులు, ప్రభుత్వాధినేతలు నిర్ణయించారు. తెలంగాణలో హైదరాబాద్, రంగారెడ్డి, మెడ్చల్-మల్కాజ్ గిరి, కరీంనగర్, కొత్తగూడెం జిల్లాలలో కరోనా వైరస్ ప్రభావం అధికంగా ఉందని గుర్తించారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో తొలి కరోనా మరణాన్ని ప్రభుత్వం ప్రకటించింది. తెలంగాణ వ్యాప్తంగా కరోనా కేసులు 67 వరకూ నమోదయ్యాయి. నగరంలోని ప్రధాన ఆసుపత్రులతో పాటు వివిధ ప్రభుత్వ కార్యలయాలను కార్వంటైన్ లో ఉంచారు. నగర శివార్లలోను దాదాపు రెండు వేల మంది వరకూ గ్రుహ నిర్బంధంలో ఉండి స్వీయ రక్షణ పొందుతున్నారు. ఇదే పరిస్థితి కరీంనగర్, కొత్తగూడెం జిల్లాలలో కూడా ఉంది. తెలంగాణలో ప్రత్యేకంగా ఎలాంటి రెడ్ జోన్ ప్రకటించప్పటికీ ఈ ఐదు జిల్లాలోను కరోనా వ్యాపించకుండా కట్టుదిట్టమైన భద్రత చర్యలు తీసుకుంటే పరిస్ధితి అదపులోకి వస్తుందని ప్రభుత్వం, వైద్య నిపుణులు చెబుతున్నారు. తెలంగాణలోని వరంగల్, నల్గొండ, ఖమ్మం, మహబూబ్ నగర్ తో సహా మిగిలిన జిల్లాలలో పరిస్థితి అదుపులో ఉందని అంటున్నారు.
ఏపీలో మూడు జిల్లాలు : ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నం, క్రిష్ణ, గుంటూరు జిల్లాలలో కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. దీనికి కారణం ఈ మూడు జిల్లాలలోను విదేశాల నుంచి వచ్చిన వారు ఎక్కువగా ఉన్నారు. ఇప్పటికే విశాఖపట్నంలో మూడు, క్రిష్ణ జిల్లాలో రెండు, గుంటూరులో రెండు కరోనా పోజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు జిల్లాలలోను కఠిన చర్యలు తీసుకుంటే పరిస్థితి అదుపులోకి వస్తుందని ఆంధ్రప్రదేశ్ వైద్య శాఖ అధికారులు నిర్ణయించినట్లు సమాచారం. తెలంగాణలో లాగే ఏపీలో కూడా ఎలాంటి రెడ్ జోన్లు ప్రకటించకపోవడం గమనార్హం.