తెలంగాణ చీఫ్ సెక్రటరీ శాంతి కుమారి ఈ నెలాఖరులో రిటైర్ కాబోతున్నారు. ఆమెకు తెలంగాణ రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ పదవిని ఇవ్వాలని సీఎం రేవంత్ నిర్ణియంచుకున్నట్లుగా తెలుస్తోంది. రాజ్యాంగబద్ధ పదవుల ఎంపిక కోసం ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్, మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను ఆహ్వానించారు కానీ ఆయన రాలేదు.
సమాచార హక్కుతో పాటు లోకాయుక్త, ఉపలోకాయుక్త, హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, సభ్యుల ఎంపికపైన చర్చించారు. ఎవరెవరికి ఏ పదవులు ఇవ్వాలో ఓ ప్రాథమిక నిర్ణయానికి వచ్చారు. ఇందులో సీఎస్ కు పదవి ఇవ్వడం ఖాయమని అంటున్నారు. సోమేష్ కుమార్ క్యాడర్ ఏపీ కావడంతో..కోర్టు ఆదేశాలతో ఆయన ఏపీకి పోవాల్సిన రావడంతో కేసీఆర్ 023 జనవరి 11వ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతికుమారిని నియమించారు.
ప్రభుత్వం మారిన తర్వాత కూడా రేవంత్ ఆమెను కొనసాగించారు. తదుపరి చీఫ్ సెక్రటరీగా రామకృష్ణా రావు పేరు వినిపిస్తోంది. ఆయన కూడా కేసీఆర్ సన్నిహిత అధికారిగా పేరు ఉంది. 1991 బ్యాచ్‌కు చెందిన తెలంగాణ కేడర్ ఐఏఎస్ అధికారి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఇప్పటివరకు 10 బడ్జెట్లు ప్రవేశపెట్టడంలో కీలక పాత్ర పోషించారు. ఆయన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ డైరెక్టర్ జనరల్‌గా కూడా పనిచేశారు. తెలంగాణ సమాచార హక్కు చట్టం ప్రధాన కమిషనర్ పదవీ కాలం 2023లోనే ముగిసింది. ఇప్పటి వరకు నియామకం చేపట్టలేదు.