చెన్నై సూపర్ కింగ్స్ ఐపీఎల్ ఫైనల్ లో ప్రవేశించింది. ఈరోజు జరిగిన క్వాలిఫైయర్ 1లో ఢిల్లీపై 4 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 172 పరుగులు సాధించింది. చెన్నై మరో రెండు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది. ఐపీఎల్ ఫైనల్లో చెన్నై జట్టు ప్రవేశించడం ఇది తొమ్మిదో సారి. ఢిల్లీ జట్టులో ఫృథ్వీ షా (60), రిషబ్ (50) పరుగులతో రాణించారు. గైక్వాడ్ (70), ఊతప్ప (63) సీఎస్కే విజయంలో కీలక పాత్ర పోషించారు.
చివరి ఓవర్లలో విజయానికి 13 పరుగులు కావల్సిన దశలో.. తొలి బంతికే మొయిన్ అలీ వికెట్ కోల్పోయింది. సమీకరణం 5 బంతుల్లో 13 పరుగులుగా ఉన్నప్పుడు ధోనీ (6 బంతుల్లో 18) రెచ్చిపోయాడు. వరుసగా 3 ఫోర్లు సాధించి చెన్నైని గెలిపించాడు. క్వాలిఫయింగ్ 2లో.. కొలకొత్తా, బెంగళూరు తలపడతాయి. అందులో గెలుపొందిన జట్టుతో.. ఢిల్లీ ప్లే ఆఫ్ ఆడుతుంది. ఈ మ్యాచ్లో గెలుపొందిన జట్టు ఫైనల్ లో చెన్నైతో తలపడుతుంది.