ఈ ఐపీఎల్ తోనే ధోని ఇన్నింగ్స్ ముగిసిందన్నది క్రికెట్ వర్గాల నమ్మకం. 2025 ఐపీఎల్ లో ధోని ఓ ఆటగాడిగా కనిపించకపోవొచ్చు. రిటైర్మెంట్ కు సంబంధించిన ప్రకటన ఏదీ ధోని నుంచి రాలేదు కానీ, తను మళ్లీ బ్యాటు పట్టుకోవడడం దాదాపు అసాధ్యమని మాజీలు చెబుతున్నారు. మరోవైపు చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం కూడా ధోనికి ప్రత్యామ్నాయం కోసం ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించింది. ఈ మేరకు రిషబ్ పంత్ ని సంప్రదించిందని, వచ్చే సీజన్లో తమ జట్టుతో కలవాలని కోరిందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. రిషబ్ పంత్ ఇప్పుడు ఢిల్లీ తరపున ఆడుతున్నాడు. ఆ జట్టుకు నాయకత్వం కూడా వహిస్తున్నాడు. ఒక వేళ పంత్ ఒప్పుకొంటే వికెట్ కీపింగ్ తో పాటు కెప్టెన్సీ కూడా పంత్ కి కట్టబెట్టే అవకాశాలు ఉన్నాయి.
Read Also: తెలుగు నేలకు ధోని మోమరబుల్ గిఫ్ట్
చెన్నైలాంటి మేటి జట్టుకు నాయకత్వం వహించడం ఏ ఆటగాడికైనా అరుదైన గౌరవమే. అందుకే పంత్ కూడా ఢిల్లీ వదిలి చెన్నై టీమ్ లో చేరడానికి ఉత్సాహం చూపిస్తున్నట్టు తెలుస్తోంది. పంత్ ని తీసుకురావాలన్నది కూడా ధోని గేమ్ ప్లాన్ లో భాగమే అని తెలుస్తోంది. ధోని వచ్చే ఐపీఎల్ కి ఆటగాడిగా కనిపించకపోవొచ్చు. కానీ చెన్నై మెంటర్‌గా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి. తాను ఆడినా, ఆడకపోయినా చెన్నైని వదులుకోడని, ఏదో ఓ రూపంలో జట్టుతోనే కలిసి ఉంటాడన్నది అభిమానుల నమ్మకం. వచ్చే సీజన్లో ధోని చెన్నైకి కోచ్‌గా కనిపించినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు.