చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు శుభవార్త. వరస పరాజయాలకు చెన్నై బ్రేక్ వేస్తూ.. ఓ చక్కటి విజయాన్ని అంకుంది. అందులోనూ వరుస విజయాలతో ఊపులో ఉన్న… బెంగళూరు జోరుని అడ్డుకుంది. ఫలితం.. చెన్నై 8 వికెట్ల తేడాతో విజయం సాధించి… పాయింట్ల పట్టికలో చివర ఉన్న చెన్నై ఈ విజయంతో 7వ స్థానంలోకి రాగలిగింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో 145 పరుగులు చేసింది. ఊరించే లక్ష్యాన్ని.. చెన్నై ఏమాత్రం తడబాటు లేకుండా అందుకుంది. ఓపెనర్లు డూప్లెసిస్, గైక్వాడ్ చెన్నై జట్టుకు మంచి ఆరంభాన్ని అందించారు. ముఖ్యంగా గైక్వాడ్ (51 బంతుల్లో 65) చెన్నై ఇన్నింగ్స్‌కు వెన్నెముకలా నిలిచాడు. రాయుడు (27 బంతుల్లో 39) రాణించడంతో.. చెన్నై గెలుపు నల్లేరుపై నడకలా సాగింది. ఈ విజయంతో చెన్నైకి ఊరట లభించింది గానీ, ఇప్పటికే… చెన్నై ప్లే అవకాశాలకు కోల్పోయింది.