ఈసారి ఐపీఎల్ కొట్టేట్టే కనిపిస్తోంది చెన్నై. తొలి ఫేజ్ లో విజృంభించిన సూపర్ కింగ్స్ … రెండో సీజన్ ఆరంభ మ్యాచ్లోనూ తన ప్రతాపం చూపించింది. పటిష్టమైన ముంబైని 20 పరుగుల తేడాతో ఓడించి – ఈ ఫేజ్ ని ఘనంగా ఆరంభించింది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నిర్ణీత 20 ఓవర్లలో 157 పరుగులు చేసింది. అనంతరం ముంబై టీం.. నిర్ణీత 20 ఓవర్లతో 7 వికెట్లు కోల్పోయి 136 మాత్రమే చేసింది. దీంతో 20 పరుగుల తేడాతో చెన్నై విజయం సాధించింది.
నిజానికి చెన్నై ఆరంభం ఏమంత బాలేదు. తొలి 6 ఓవర్లలో 24 పరుగులు మాత్రమే చేసింది. కీలకమైన 4 వికెట్లు కోల్పోయింది. దానికి తోడు అంబటి రాయుడు కూడా గాయంతో రిటైర్డ్ హార్డ్ గా వెనుదిరిగాడు. దాంతో.. చెన్నై కనీసం 100 పరుగులైనా చేస్తుందా? అనిపించింది. ఈ దశలో రుతురాజ్ గైక్వాడ్ (55 బంతుల్లో 88) ఆదుకున్నాడు. జడేజా (26), బ్రావో (8 బంతుల్లో 23) తోట్పాటు తో చెన్నైకి గౌరవ ప్రదమైన స్కోరు అందించాడు. ధోనీ (3), రైనా (4), డుప్లెసీ (0), మొయిన్ అలీ (0) తీవ్రంగా నిశార పరిచారు.
ఆ తరవాత బ్యాటింగ్ కి దిగిమన ముంబై – చెన్నై బౌలర్లని సమర్థవంతంగా ఎదుర్కోవడంలో విఫలం అయ్యింది. తివారీ (50) ఒక్కడే కాస్త రాణించాడు. ఈ మ్యాచ్లో రోహిత్ ఆడకపోవడంతో పొలార్డ్ కెప్టెన్ గా వ్యవహరించాడు.