అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు ఆసక్తి ఉన్న ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తమ కళా ప్రదర్శన చేసి అబ్బురపరిచారు. పలు సందర్భాల్లో చంద్రబాబు, పవన్ కల్యాణ్ నవ్వు ఆపుకోలేకపోయారు.చివరి రోజు సభ వాయిదా పడిన తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చాలా మంది ముందుగానే రిహార్సల్స్ కూడా చేసుకుని సీరియస్ గా తమ ప్రతిభను ప్రదర్శించారు. కళాభిమానిగా పేరున్న డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు “దాన వీర శూర కర్ణ” సినిమాలోని సూపర్ హిట్ డైలాగ్ ను ఏకపాత్రాభియం ద్వారా చెప్పారు. జనసేన ఎమ్మెల్యేలు వేసిన పవన్ కల్యాణ్ పేరడీ స్కిట్ అందర్నీ ఆకట్టుకుంది. చంద్రబాబు, పవన్ తో పాటు అందరూ విపరీతంగా నవ్వారు.
రాజకీయంగా సైటైర్లు వేసుకుంటూ.. నాటకాలను ప్రదర్శించారు. ఆ తర్వాత ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులను ప్రదానం చేశారు. ఉమ్మడి రాష్ట్రం అసెంబ్లీ ఉన్నప్పుడు ఎంత వేడి..వాడి చర్చలు జరిగినా సభ్యుల మానసిక ఉల్లాసం కోసం ఇలాటి కార్యక్రమాలు నిర్వహించేేవారు. తర్వాత తగ్గిపోయాయి. వైసీపీ హయాంలో అసలు అసెంబ్లీలో ఘోరమైన ఘటనలు తప్ప.. సభ్యుల మధ్య సుహృద్భావం ఉండే పరిస్థితి కూడాకనిపించలేదు.
ఇప్పుడు మళ్లీ సభ్యులు చర్చలు మాత్రమే కాకుండా.. మానసిక ఆనందం కోసం.. ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లోనూ పాల్గొని తమ ప్రతిభా ప్రదర్శన చేశారు. అసెంబ్లీకి హాజరు కాకుండా.. వచ్చినట్లుగా సంతకం చేసి సైలెంట్ గా వెళ్లిపోయిన వైసీపీ ఎమ్మెల్యేలు..కూటమి ఎమ్మెల్యేలు ఆనందాన్ని కూడా కోల్పోయారు.అసెంబ్లీకి వెళ్లకపోయినా ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొన్నా జగన్ అంగీకరించరు.