డబ్బులు ప్రింట్ కొట్టే మిషన్లు కేంద్రం వద్ద ఉంటే.. ఇక డబ్బులు కొరత కేంద్రానికి ఎలా ఉంటుందని సీఎం జగన్మోహన్ రెడ్డి లాంటి మేధావులు చెబుతూ ఉంటారు కానీ ప్రింటవుతున్న డబ్బులు కూడా ఆర్బీఐకి చేరట్లేదని తాజాగా తేలింంది . గతంలో పెద్ద నోట్లను రద్దు చేసిన కొత్త 500 నోట్లను తీసుకు వచ్చిన సమయంలో దేశంలోని 3 ముద్రణాలయాల నుంచి 8,810.65 మిలియన్ల 500 రూపాయల నోట్లను ముద్రించారు. అందులో కేవలం 7,260 మిలియన్ల నోట్లు మాత్రమే ఆర్బీఐకి చేరినట్లు ఆర్టీఐ నివేదిక తెలిపింది. మిగతా 1,760.65 మిలియన్ల నోట్లకు సంబంధించి ఎలాంటి సమాచారం ఆర్బీఐ వద్ద లేదు.
దేశంలో మూడు చోట్ల కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. బెంగళూర్‌లోని రిజర్వ్ బ్యాంక్ నోట్ ముద్రణ్ లిమిటెడ్, నాశిక్‌లోని కరెన్సీ ప్రెస్, మధ్యప్రదేశ్ దేవస్‌లోని బ్యాంక్ నోట్ ప్రెస్‌లో దేశానికి అవసరమైన కరెన్సీ నోట్లను ముద్రిస్తారు. 2016-17 మధ్య కాలంలో 1,662 మిలియన్ల 500 రూపాయల నోట్లను ముద్రించినట్లు నాశిక్ మింట్ వెల్లడించింది. బెంగళూర్ ప్రెస్‌లో 5,195.65 మిలియన్లు, దేవస్లో 1,953 మిలియన్ల నోట్లను ముంద్రించినట్లు ఆర్టీఐ ద్వారా వెల్లడైంది. ఆర్బీఐ మాత్రం కేలం 7260 మిలియన్ల నోట్లు మాత్రమే అందినట్లు తెలిపింది.
ఆర్బీఐ వద్ద 88,032.5 కోట్ల విలువైన 500 రూపాయల నోట్ల వివరాలు లేవు. సమాచార హక్కు చట్టం ప్రకారం మనోరంజన్‌రాయ్ అనే సామాజిక కార్యకర్త పెట్టుకున్న దరఖాస్తుకు ఆర్బీఐ ఇచ్చిన సమాధానంలో ఈ విషయం వెల్లడైంది. సరే.. మరి ఆ డబ్బులన్నీ ఎటు పోయాయో.. విచారణ చేశారా… ఎవరైనా కొట్టేశారా లేకపోతే.. ఏమయ్యాయి అనే అంశాలు కూడా ఎవరికీ తెలియదు. అదే మన గవర్నెన్స్ అనుకోవాలేమో ?. ప్రింటింగ్ దగ్గర నుంచే నేరుగా శేఖర్ రెడ్డి లాంటి వాళ్లకు చేరిపోయి ఉంటాయి.. ఆర్థిక వ్యవస్థలోకి వచ్చేసి ఉంటాయి.. అందుకే లైట్ తీసుకున్నారేమో ?