యాక్షన్, ఎలివేషన్స్, ఎమోషన్స్ ఇవన్నీ మేళవించిన ‘డాకూ మహారాజ్’ ట్రైలర్ వచ్చేసింది. 2 నిమిషాల 44 సెకన్ల ట్రైలర్ పవర్ ప్యాక్డ్స్గా రెడీ చేసి వదిలింది చిత్రబృందం. బాలయ్య ఇందులో డాకూ మహారాజ్, సీతారామ్, నానాజీ… ఇలా మూడు రకాల వేరియేషన్స్ లో కనిపిస్తున్నాడు. బాడీ డియోల్ పాత్రనీ స్టైలీష్ గా తీర్చిదిద్దారు. ‘డాకూ’లో ఓ పాప పాత్ర కీలకమని ముందు నుంచీ చెబుతూనే ఉన్నారు. ఆ పాప క్యారెక్టర్ ఎంత కీలకమో ఈ ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. విజువల్స్ రిచ్ గా ఉన్నాయి. డైలాగుల్లో హీరోయిజం పండించాడు బాబీ.
అనగనగా ఓ రాజు ఉండేవాడు.. చెడ్డవాళ్లంతా ఆయన్ని డాకూ అనేవారు. మాకు మాత్రం మహారాజు
ఈ ఆడవిలో ఎన్నో మృగాలున్నాయని భయపడుతున్నాం, ఏ ఎలుగుబంటో పులో వస్తే.. ఇక్కడ కింగ్ ఆఫ్ జంగిల్ ఉన్నాడమ్మా..
– ఈ రెండూ హీరోయిజాన్ని ఎలివేట్ చేసే డైలాగులే.
అసలు ఎవడ్రా నువ్వు అని విలన్ గ్యాంగ్ అడిగితే – మైఖేల్ జాక్సన్ అని అనడం బాలయ్య టైపు పంచ్ డైలాగ్.
విజువల్స్ అన్నీ భారీగానే ఉన్నాయి. బాబీ ఓ కొత్త వరల్డ్ సృష్టించాడు. ముఖ్యంగా తమన్ తన బీజియంతో అదరగొట్టేశాడు. తన ఎలివేషన్లకు ఈసారి బాక్సులు బద్దలైపోవడం ఖాయం. ఇప్పటికే డాకూపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ తో అవి ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం.