గేమ్ ఛేంజర్ వచ్చేసింది. ఇక అందరి కళ్లూ డాకూ మహారాజ్ పైనే. ముందు నుంచీ ఈ సినిమాపై పాజిటీవ్ బజ్ నడుస్తోంది. టీజర్ ఫ్యాన్స్ కి నచ్చింది. ట్రైలర్ కూడా బాగా కట్ చేశారు. అయితే బాలయ్య మార్క్ డైలాగులు లేవన్న కంప్లైంట్ వినిపించింది. నిర్మాత నాగవంశీ కూడా ఈ విషయాన్ని ఒప్పుకొన్నారు. కొత్తగా ట్రై చేశామని, అందుకే డైలాగుల జోలికి వెళ్లలేదని ఆయన క్లారిటీ ఇచ్చారు. అయితే ఎక్కడో ఓ చిన్న అసంతృప్తి ఉంది. అందుకే ఈసారి డైలాగులతో మరో ట్రైలర్ కట్ చేశారు. ఈసారి వన్ లైనర్లు ఆటం బాంబులెక్కన పేలాయి.
హమ్ కో దుష్మన్ కమ్.. జాన్ దేనేవాలే ఫ్యాన్స్ జాదా హై…!
రాయలసీమ మాలూమ్ తేరేకో… ఓ మేరా అడ్డా…
ఎవరైనా చదవడంలో మాస్టర్స్ చేస్తారేమో, నేను చంపడంలో చేశా. ఐ డూ మాస్టర్స్ ఇన్ మర్డర్స్…
– ఇలా పవర్ ఫుల్ డైలాగులతో ట్రైలర్‌ని ఫ్యాన్స్ కి నచ్చేలా కట్ చేశారు. యధావిధిగా తమన్ తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొట్టాడు. విజువల్స్ బాగున్నాయి. బాలయ్య మేకొవర్ అదిరింది. ఈసారి డాకూ కంటే.. మిగిలిన లుక్స్ పై ఎక్కువగా ఫోకస్ చేశారు. హీరో – విలన్ మధ్య వార్ హైలెట్ చేశారు. 12న ఈ సినిమా థియేటర్లలోకి వస్తోంది. మధ్యలో ఒకే రోజు ఉంది. ఈలోగా ట్రైలర్‌తో ఫ్యాన్స్ పండగ చేసుకోవడం ఖాయం.