డైరెక్టర్ సుకుమార్ కుమార్తె సుకృతి వేణి సినీ రంగప్రవేశం చేసింది. ఆమె ప్రధాన పాత్రలో నటించిన చిత్రం గాంధీ తాత చెట్టు. ఈ చిత్రాన్ని గతంలో పలు ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించారు. తాజాగా ఈ సినిమాకి గానూ ఉత్తమబాల నటిగా దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం సుకృతికి వరించింది. ఢీల్లిలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో ఈ అవార్డును అందజేశారు. పర్యావరణ పరిరక్షణ ముఖ్య వుద్దేశంగా తెరకెక్కిన ఈ సందేశాత్మక చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్‌తో పాటు గోపీ టాకీస్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మించాయి. పద్మావతి మల్లాది దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి తబితా సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరిస్తున్నారు. త్వరలోనే సినిమా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.