దగ్గుబాటి కుటుంబం నుంచి మరో హీరో వస్తున్నాడు.. తనే దగ్గుబాటి అభిరామ్. అభిని హీరోని చేసే బాధ్యత సురేష్ బాబు… తేజకు అప్పగించాడు. ఈ కాంబినేషన్ లో ఓ సినిమా వస్తుందని చాలా రోజుల నుంచి ప్రచారం జరుగుతూ వచ్చింది. ఎట్టకేలకు ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి `అహింస` అనే పేరు పెట్టారు. తేజ ప్రేమ కథా చిత్రాలకు స్పెషలిస్టు. యువ హీరో, హీరోయిన్లు దొరికితే చాలు.. లవ్ స్టోరీ అల్లేస్తాడు. అయితే ఈసారి.. అందుకు భిన్నమైన కథ, కథనాలను ఎంచుకున్నట్టు తెలుస్తోంది. ఇదో యాక్షన్ డ్రామా. `అహింస` అనే పేరు పెట్టినా, యాక్షన్ కి పెద్ద పీట వేసినట్టు తెలుస్తోంది. తేజ ప్రేమకథా చిత్రాల్లో హింసకు స్థానం ఉంటుంది. ఈసారి మాత్రం వెరైటీగా అహింస అనే పేరు పెట్టాడు. ఈ చిత్రంలో కథానాయిక కోసం అన్వేషణ జరుగుతోంది. కృతి శెట్టిని సంప్రదించినా.. తనకు డేట్లు కుదరకపోవడంతో నో చెప్పింది. మరి హీరోయిన్ ఛాన్స్ ఎవరికి దక్కుతుందో చూడాలి.