దగ్గుబాటి వెంకటేశ్వరరావు, దగ్గుబాటి హితేశ్ రామ్ .. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. సహజంగానే ఇది రాజకీయంగా సంచలనం సృష్టించింది. ఎన్టీఆర్ అల్లుడు కాబట్టి… ఇలాగే ఉంటుంది. పురందేశ్వరి మాత్రం తాను బీజేపీలోనే కొనసాగుతానని ప్రకటించారు. దీంతో.. దగ్గబాటి వ్యవహారం.. ఇప్పుడు… చర్చనీయాంశం అయింది. ఇప్పుడు… దగ్గుబాటి వెంకటేశ్వరరావు ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారు..? కుమారుడు వైసీపీలో ఉంటే.. తల్లి పురందేశ్వరి బీజేపీలో ఉండటం వల్ల… ఎలాంటి రాజకీయం జరిగే అవకాశం ఉంది..? జగన్మోహన్ రెడ్డి దగ్గుబాటి ఫ్యామిలీని ఎందుకు చేర్చుకున్నారు. దగ్గుబాటి వారసుడు వైసీపీలో చేరితే.. చంద్రబాబు, టీడీపీపై ఎలాంటి ప్రభావం ఉంటుంది..?
చంద్రబాబు వ్యతిరేకతే దగ్గుబాటి రాజకీయం..!
దగ్గుబాటి కుటుంబం.. చంద్రబాబు వ్యతిరేకత రాజకీయాలు చేస్తోంది. చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవరు బలంగా ఉంటే వారితో కలుస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో జరిగిన కీలక పరిణామాల్లో… చంద్రబాబు, దగ్గుబాటి ఇద్దరూ పాలు పంచుకున్నారు. రెండు కత్తులు.. ఒకే ఒరలో ఇమడవు అన్నట్లుగా దగ్గుబాటి కుటుంబం ఎక్కువ కాలం పార్టీలో ఉండలేకపోయయింది. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వం తమకూ కావాలని.. చాలా ప్రయత్నాలు చేశారు. హరికృష్ణ, దగ్గుబాటి… కూడా.. ఈ ప్రయత్నాలు చేశారు. కానీ వారు ఎన్టీఆర్ రాజకీయ వారసులుగా నిరూపించుకుని నిలబడలేకపోయారు. కానీ చంద్రబాబు మాత్రం.. తెలుగుదేశం పార్టీపై పూర్తి పట్టు సాధించారు. ప్రజలు కూడా ఆమోదించారు. ప్రజలు ఆమోదించారు. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ప్రజలు పట్టం కట్టారు. టీడీపీ పరిణామాల్ని… అనేక మంది కుట్ర అని.. మరొకటని అంటూ ఉంటారు. ఆ ఘటనకు ఏవైనా పేర్లు పెట్టవచ్చు కానీ.. చారిత్రత్మాకమైన నిజం ఏమిటంటే… పార్టీతో పాటు ప్రజలు కూడా…. చంద్రబాబు వెంటే నడిచారు. ఎన్టీఆర్ ఉన్నప్పుడు కూడా.. టీడీపీ అంతా చంద్రబాబు వెంటే ఉంది. లక్ష్మిపార్వతి, హరికృష్ణ కూడా రాజకీయా పార్టీల ప్రయత్నాలు చేశారు. కానీ ప్రజలు మాత్రం.. ఎన్టీఆర్ రాజకీయ వారసత్వాన్ని చంద్రబాబుకే అప్పగించారు. లక్ష్మిపార్వతిని టీడీపీలోకి తీసుకోరు కాబట్టి.. ఆమె వైసీపీలో చేరారు. మిగిలిన వారిలో ఇంకెవరికి రాజకీయ ఆసక్తులులేవు. దగ్గుబాటి కూడా.. చంద్రబాబుతో కలసి పని చేయలేరు. వారికి రాజకీయ ఆసక్తులు ఉన్నాయి. అందుకే… పురందేశ్వరి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ లో ఉంటేనే చంద్రబాబును ఎదుర్కోవచ్చని భావించారు. రాష్ట్ర విభజన పరిణామాలతో … కాంగ్రెస్ కు భవిష్యత్ లేదనుకున్నారు. ఎన్టీఆర్ కుటుంబసభ్యులు.. వైసీపీలో చేరడం సహజంగా వ్యతిరేక భావన తెస్తుంది. అందుకే అప్పట్లో బీజేపీలో చేరలేదు. కానీ ఇప్పుడు బీజేపీకి కూడా రాజకీయ భవిష్యత్ లేదని ప్రత్యేకహోదా అంశం తేల్చింది. దాంతో వారికి.. చివరి చాన్స్ వైసీపీనే అయింది. అందువల్ల చంద్రబాబును ప్రతిఘటించడమే రాజకీయ లక్ష్యం కాబట్టి… వైసీపీనే ఇప్పుడు చంద్రబాబుకు పోటీ ఇస్తోంది కాబట్టి.. ఆ పార్టీలో చేరిపోయారు. అంతే కానీ… జగన్ ను నమ్మో.. ఆ పార్టీ సిద్ధాంతాలు నచ్చో… దగ్గుబాటి వైసీపీలో చేరలేదు. కేవలం చంద్రబాబును రాజకీయంగా ప్రతిఘటించడానికి మాత్రమే వైసీపీలో చేరారు.
తల్లీకుమారులు వేర్వేరు పార్టీల్లో ఉండొచ్చా..?
కుమారుడు వైసీపీలో చేరితే.. తల్లి పురందేశ్వరి బీజేపీలో ఉన్నారు. తల్లికొడుకులు ఒకే పార్టీలో ఉండాలన్న రూల్ లేదు. అయితే… ఇలా వేర్వేరు పార్టీల్లో ఉండటం వల్ల రాజకీయ విమర్శలు వస్తాయి. వైసీపీ, బీజేపీలు టీడీపీ వ్యతిరేక రాజకీయాలు చేస్తున్నాయి కాబట్టి… భావజాలంలో తేడా ఉండదనుకోవచ్చు. కానీ టీడీపీ ఎదురు దాడి చేసే అవకాశం ఉంది. బీజేపీ, వైసీపీ ఒక్కటే, జగన ను.. మోడీ నడిపిస్తున్నాడని… విమర్శలు చేస్తున్న టీడీపీకి… ఓ అవకాశం ఇలాంటి పరిస్థితుల ద్వారా వచ్చిందని అనుకోవచ్చు. ఇప్పటికే ఈ అంశంపై విమర్శలు ప్రారంభమయ్యాయి. రెండు పార్టీలు ఒక్కటేనన్న అభిప్రాయం కల్పించడానికి… టీడీపీ కచ్చితంగా ప్రయత్నిస్తుంది. అదే సమయంలో.. పురందేశ్వరి కూడా పార్టీ మారుతారనే ప్రచారం జరిగింది. కానీ వెంటనే… ఓ ప్రకటన విడుదల చేశారు. దాని ప్రకారం… పురందేశ్వరి ఉంటే.. బీజేపీలో ఉంటారు.. లేకపోతే సైలెంట్ గా ఉంటారని ప్రకటించారు. అంటే.. ఆమె… రాజకీయ వారసత్వాన్ని కుమారుడికి అప్పగించి తాను సైలెంట్ అయిపోవడానికి సైతం సిద్దమయ్యారని అనుకుంటున్నారు .
దగ్గుబాటి వైసీపీలో చేరికతో చంద్రబాబుకు ఎంత నష్టం..?
దగ్గుబాటి హితేష్ రామ్ వైసీపీలో చేరడం వల్ల జగన్ కు ఎంత లాభం ఉంటుందని చెప్పలేం. ఈ చేరికకు ఓ సింబాలిక్ వాల్యూ ఉంటుంది. ఎందుకంటే హితేష్ రామ్… ఎన్టీఆర్ మనవడు, లోకేష్ కజిన్, ఎన్టీఆర్ కుటుంబంలోని వారసుడు.. ఇలా చెప్పుకుంటూ పోతే.. ఓ సింబాలిక్ వాల్యూ ఉంటుంది. కానీ.. రాజకీయ లాభం ఉంటుందా..? అంటే చెప్పడం కష్టం. మీడియాలో అంచనాలు వేస్తున్న ప్రకారం చూస్తే… ప్రకాశం జిల్లాపై ఇంపాక్ట్ ఉంటుందంటున్నారు కానీ.. రాష్ట్రవ్యాప్తంగా ఉంటుందని ఎవరూ చెప్పడం లేదు. ఆ ప్రకాశం జిల్లాపై ఎంత ఇంపాక్ట్ ఉంటుందో మాత్రం చెప్పలేము. చంద్రబాబుకు ఏమైనా నష్టం జరుగుతుందా..? అంటే.. ఇలాంటి రాజకీయ ఘటనలు చరిత్రలో చాలా జరిగాయి. సోనియా తోడికోడలు.. మనేకా గాంధీ… బీజేపీలో చేరారు. ఆమె కేంద్రమంత్రి.. ఆమె కుమారుడు ఎంపీ అయ్యారు. కానీ కాంగ్రెస్ కు కానీ.. సోనియాకు కానీ.. రాజకీయంగా ఎలాంటి నష్టం జరగలేదు. రాజకీయ వారసత్వం ఎవరికి ఇవ్వాలనుకుంటే.. ప్రజలు వారికి ఇస్తారు. ఎమ్డీఆర్, ఎన్టీఆర్, ములాయం వంటి నేతల విషయంలో ప్రజలు ఆదరించిన వాళ్లే వారసులయ్యారు. ఎలా చూసినా… టీడీపీ రాజకీయ వారసత్వం చంద్రబాబుకు వచ్చేసింది. ఇతర పార్టీల్లో చేరి… ఎన్టీఆర్ వారసత్వాన్ని పొందడం సాధ్యం కాదు. అందువల్ల… చంద్రబాబుపై పెద్దగా రాజకీయ ప్రభావం చూపే అవకాశం లేదు.