దగుమాటి వెంకట కృష్ణారెడ్డి అలియాస్ కావ్య కృష్ణారెడ్డి ఈయన ..ఇటీవల మహానాడులో టీడీపీకి రూ. కోటి విరాళం ఇచ్చారు. ఇందులో విశేషం ఏమీ లేదు కానీ.. ఆయన ఇప్పటి వరకూ వైసీపీలో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు టీడీపీలోనే ఉండేవారు. ఎన్నికల కు ముందే టీడీపీకి రాజీనామా చేసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి చెప్పారని వైసీపీలో చేరారు. అంతకు ముందు నుంచీ ఆయనకు స్టోన్ క్రషన్ వ్యాపారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎన్నికలకు ముందు మళ్లీ టీడీపీ గెలుస్తుందని ఆయన అనుకున్నారేమో కానీ మళ్లీ టీడీపీలోకి జంప్ కొట్టారు. అంతే కాదు ఏకంగా కోటి రూపాయల విరాళం ఇచ్చారు.
ఏపీలో టీడీపీకి రూ. కోటి విరాళం ఇచ్చి వ్యాపారం చేయడం సాధ్యమేనా అనే డౌట్లు ఎవరికైనా వస్తాయి.. వెంటనే.. అసాధ్యమని నిరూపించేసింది వైసీపీ ప్రభుత్వం. ఆయన స్టోన్ క్రషర్ వ్యాపారాలపై స్పందనలో ఫిర్యాదులు చేయించి.. నేరుగా సీఎంవో జోక్యం ద్వారా .. విచారణ చేయించి ఆఘమేఘాల మీద.. ఆయనకు రూ. 142 కోట్ల జరిమానా విధించారు. ఈ జరిమానా చూసి ఆయన ఏమనుకున్నారో కానీ.. మిగతా వాళ్లు మాత్రం.. హమ్మ.. టీడీపీకి విరాళం ఇచ్చి ఏపీలో వ్యాపారం చేద్దామనేనా అని ఎటకారం చేయడం ప్రారంభించారు. ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చాక.. మైనింగ్ వ్యాపారం చేసే వాళ్లందరికీ ఇలా వందలకోట్లలో జరిమానా వేశారు.
కొంత మంది కోర్టులకు వెళ్లారు. మరికొంత మంది కట్టలేక మైనింగ్ ను.. వైసీపీ పెద్దలకు అప్పగించేశారు. వారి జరిమానాల గురించి పట్టించుకోలేదు. ఐదేళ్లు టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా చేసిన గ్రానైట్ వ్యాపారి శిద్దా రాఘవరావు లాంటి వాళ్లు.. వైసీపీలో చేరి.. వ్యాపారాలను కాపాడుకున్నారు. ఇప్పుడు కావ్య కృష్ణారెడ్డి ఏం చేస్తారో కానీ.. ఇలాంటి భయంకర పాలనను మాత్రం ఎప్పుడూ చూడలేదని.. ఇక ముందు చూడలేమని కూడా దుమ్మెత్తి పోసుకుంటున్నారు.