దళిత వైద్యులైన సుధాకర్, అచ్చెన్నల్లా తాను ప్రాణాలు పోగొట్టుకోవడానికి సిద్ధంగా లేనని… అందుకే ఏపీ వదిలి వచ్చేశానని ఎమ్మెల్యే డాక్టర్ శ్రీదేవి ప్రకటించారు. డాక్టర్ సుధాకర్ గురించి రాష్ట్రం మొత్తం తెలుసు. మరి డాక్టర్ అచ్చెన్న ఎవరు అని అందరూ ఒక్క సారిగా ఆశ్చర్యపోయారు. డాక్టర్ అచ్చెన్న హత్య అంతకు ముందు రోజే జరిగింది. అదీ కూడా కడప జిల్లాల్లో. హైలీ రెస్పెక్టడ్ సామాజికవర్గానికి చెందిన వ్యక్తే ప్రధాన సూత్రధారిని పోలీసులు తేల్చారు కానీ ఇందులో బయటకు రాని రాజకీయ కోణాలు చాలా ఉన్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇదే విషయాన్ని ఉండవల్లి శ్రీదేవి ప్రకటించారు.
కడపలోని జిల్లా పశు సంవర్ధక శాఖలో డిప్యూటీ డైరెక్టర్‌గా పని చేస్తున్న డాక్టర్ సి.అచ్చెన్న ను వారం రోజుల కిందట సస్పెండ్ చేశారు. మరో ముగ్గురు తోటి ఉద్యోగులతో ఏర్పిడన వివాదంలో ఆయనదే తప్పని చెబుతూ ఆయనపై ఉన్నతాధికారులు సస్పెన్షన్ వేటు వేశారు. నిజానికి ఆయన అంతకు రెండు రోజుల ముందే కనిపించకుండా పోయారు. ఆయన కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారులు ఇదేమీ పట్టించకుకోకుండా ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. పోనీ పోలీసులు విచారణ జరిపారా అంటే లేదు. రకరకాల కారణాలు చెబుతూ పది రోజుల పట్టించుకోలేదు. హఠాత్తుగా ఆయన మృతదేహం బయటపడింది. ఈ నెల 12న అదృశ్యమైన అచ్చెన్న 24న అన్నమయ్య జిల్లాలో శవమై కనిపించారు.
మొదట ఆత్మహత్య.. అన్నట్లుగా ప్రచారం చేసి.. చివరికి హత్య గా పోలీసులు నమోదు చేశారు. ఇలా మార్పు వెనుక చాలా పరిణామాలు చోటు చేసుకున్నాయి. డాక్టర్ అచ్చెన్నను పశుసంవర్ధక శాఖలో ఎడిలు శ్రీధర్ లింగారెడ్డి, సుధీర్‌నాథ్ బెనర్జీ, సుభాష్ చంద్రబోస్ కలిపి హత్య చేశారని పోలీసులు చెబుతున్నారు. మొత్తంగా మరో దళిత అధికారి ప్రాణాలు కోల్పోయారు. ఈ వ్యవహారం .. దళిత వర్గాల్లో సంచలనం రేపుతోంది. సైలెంట్‌గా చంపుతున్నారని… బయటకు రాకుండా చేస్తున్నారని వారు ఆందోళన చెందుతున్నారు.