రోమ్ నగరం తగలబడిపోతుంటే… చక్రవర్తి పిడేల్ వాయించుకుంటూ కూర్చున్నాడట. అలానే వుంది టీ సిరిస్ మ్యూజిక్ ఛానల్ పరిస్థితి. అల్లు అర్జున్ పుష్ప సినిమా విజయం సంగతి ఏమోకానీ ఆ సినిమా ప్రిమియర్ లో జరిగిన తొక్కిసలాట బన్నీ మెడకు చుట్టుకుంది. ఈ కేసులో ఎ11గా బన్నీని అరెస్ట్ చేయడం బెయిల్ రావడం. మళ్ళీ పోలీసుల విచారణకు పిలవడం.. ఇలా ప్రతిరోజూ ఓ సంచలనమే అన్నట్టుగా వుంది.
ఇదే సందర్భంలో పుష్ప సినిమా కథపై కూడా గిట్టని వాళ్ళు విమర్శలు గుప్పిస్తున్నారు. కొన్ని సన్నివేశాలు పోలీసుల్ని కించపరిచేలా ఉన్నాయని తీన్మార్ మల్లన్న లాంటి జర్నలిస్ట్ నాయకులు కేసులు కూడా పెట్టేశారు.
ఇలాంటి సమయంలో సందట్లో సడేమియా అన్నట్టుగా పుష్ప సినిమా నుంచి ‘దమ్ముంటే పట్టుకోరా షికావత్’ పాటని ఆ సినిమా ఆడియో రైటర్స్ కొనుకున్న టీసిరీస్ రిలీజ్ చేసింది.
ఈ సీన్ సినిమాలో బాగా పేలింది. పోలీసులకు పుష్ప ఛాలెంజ్ చేసే సీన్ ఇది. బన్నీ వాయిస్ లోనే వుంటుంది. ఇప్పుడు బన్నీ రియల్ లైఫ్ ఏం జరుగుతుందో అందరికీ తెలిసిందే. ఇలాంటి సమయం ఆ పాట రిలీజ్ కావడంతో మళ్ళీ హంగామా మొదలైయింది. అనవసరమైన హంగామా ఇది. ఏంటో.. బన్నీకి ఏదీ కలిసిరావడం లేదు.