పవన్ కల్యాణ్ మరో భూరి విరాళం ప్రకటించారు. దామోదరం సంజీవయ్య స్మారకం కోసం రూ. కోటి విరాళం ప్రకటించారు. ఆ కోటితో పాటు నిధిని ఏర్పాటు చేసివిరాళాలు సేకరించి ఆయన స్మారకం నిర్మిస్తామన్నారు. దామోదరం సంజీవయ్య ఉమ్మడి ఏపీ ముఖ్యమంత్రి. రెండేళ్ల పాటు మాత్రమే ముఖ్యమంత్రిగా పనిచేశారు. అయితే రెండేల్లలోనే ఎన్నో కీలకమైన పనులు చేశారు. కానీ ఆయనకు తగినంత గుర్తింపు రాలేదు. కాంగ్రెస్ రాజకీయాల్లో ఆయన పదవిని కోల్పోక తప్పలేదు. ఆ తర్వాత ఆయనను స్మరించుకోవడం కూడా తగ్గిపోయింది.
అయితే పవన్ కల్యాణ్ మాత్రం ఆయన మంచి పనులన్నింటినీ వెలుగులోకి తెచ్చారు. ఏపీకి తొలి దళిత ముఖ్యమంత్రి అయిన సంజీవయ్య . హైదరాబాద్ పరిసరాల్లో 6లక్షల ఎకరాలను పేదలకు పంపిణీ చేశారు. వృద్ధులు, వికలాంగులకు పింఛన్లు ప్రారంభించారు. బోయలు, కాపు కులాలను బీసీల్లో చేర్చారు. వీటన్నింటినీ పవర్ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమంత్రిగా దిగిపోయిన తర్వాత నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ మంత్రివర్గాల్లో ఆయన సభ్యుడు.
పవన్ కల్యాణ్ రూ. కోట్లలో విరాళాలు ప్రకటిస్తూ ఉంటారు. గతంలో సైనిక సంక్షేమ నిధికి కూడా ప్రకటించారు. ఆ తరహాలో ఈ సారి దామోదరం సంజీవయ్య ఇంటి కోసం రూ. కోటి ప్రకటించారు. అయితే ఇది రాజకీయ కార్యక్రమానికి ప్రకటించిన విరాళం అనుకోవచ్చు. బీజేపీ పటేల్‌ను పోస్టర్ బాయ్‌గా వాడుకున్నట్లుగా .. జనసేన ఇక నుంచి దామోదరం సంజీవయ్యను ముందుపెట్టి రాజకీయం చేసే వ్యూహం అమలు చేస్తున్నారని అనుకోవచ్చు. సీరియస్‌గా ఈ అంశంపై దృష్టి పెట్టి.. సంజీవయ్య సేవలను జనసేన అడాప్ట్ చేసుకుంటే.. దళిత వర్గాల్లో మరింత ఓటు బ్యాంక్ పెంచుకునేందుకు జనసేనకు అవకాశం ఉంటుంది.