నిర్మాత దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ తో పాన్ ఇండియా విజయాన్ని అందుకున్నారు. అదే జోరులో మరో రెండు పెద్ద సినిమాలని ఖరారు చేశారు. చిరంజీవి- వెంకీ కుడుమల, ప్రభాస్- మారుతి కాంబినేషన్ సినిమాలు రూపొందించబోతున్నారు దానయ్య. ఐతే ఈ రెండు కాంబినేషన్లు ఓకే కానీ ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తారన్న క్లారిటీ మాత్రం లేదు. ప్రస్తుతం గాడ్ ఫాదర్, భోళా శంకర్, వాల్తేర్ వీరయ్య సినిమాలతో బిజీగా వున్నారు చిరు. ప్రభాస్ సలార్, ఆదిపురుష్ లతో బిజీ. దర్శకుడు మారుతి, వెంకీ కుడుముల ఇద్దరూ బాండ్ స్క్రిప్ట్ లతో రెడీగా వున్నారు. ఐతే ప్రభాస్, చిరు మాత్రం షూటింగ్ విషయంలో ఎలాంటి అప్డేట్ ఇవ్వడం లేదు. నిర్మాత దానయ్య ఇద్దరి హీరోల షూటింగ్ సిగ్నల్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ రెండు సినిమాల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళుతుందో అనే క్లారిటీ ఇంకా రాలేదు. ప్రభాస్, చిరు.. ఎవరుముందు సెట్స్ కి వెళ్తారో వేచిచూడాలి.