టాలీవుడ్ లోని బెస్ట్ డాన్సర్లలో నితిన్ ఒకడు. అలాంటిది నితిన్ కి డాన్స్ రాదని ఓ డాన్స్ మాస్టర్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఆయనెవరో కాదు.. అమ్మరాజశేఖర్. ”నితిన్‌కి డాన్స్ రాదు. వాడికి డాన్స్ నేర్పించిన మాస్టర్ని నేను. అలాంటిది నన్నే మర్చిపోయాడు.. నన్ను చాలా నిరుత్సాహానికి గురి చేశాడు..” అంటూ షాకింగ్ కామెంట్స్ చేశాడు అమ్మ రాజశేఖర్. నితిన్ పై తీవ్ర స్థాయిలో మండి పడ్డాడాయన. ఓరకంగా శాపనార్థాలు కూడా పెట్టాడు.
విషయం ఏమిటంటే… అమ్మ రాజశేఖర్ నిర్మాతగా, హీరోగా ఓ చిత్రం తెరకెక్కింది. దానికి సంబంధించిన ఫంక్షన్ హైదరాబాద్‌లో జరిగింది. ఈ కార్యక్రమానికి నితిన్ ని ఆహ్వానించాడు అమ్మరాజశేఖర్. కానీ నితిన్ వస్తానని చివరి నిమిషంలో హ్యాండిచ్చాడు. దాంతో అమ్మ రాజశేఖర్‌కి కోపం వచ్చింది. స్టేజీపై నితిన్ పై రుసరుసలాడేశాడు. ”నితిన్ కోసం గంటల తరబడి కూర్చుని ఏవీ చేయించాను. తను వస్తానని రాలేదు. రాకపోవడానికి కూడా కారణాల్లేవు. తనకు షూటింగ్ లేదు. ఇంట్లోనే ఉన్నాడు. జ్వరమని అబద్ధం చెప్పాడు. నితిన్‌కి డాన్స్ రాదు. నేను వాడికి నేర్పాను. అలాంటి గురువుని మర్చిపోతాడా. అమ్మనీ, గురువునీ మర్చిపోయిన వాళ్లు బాగుపడరు. ఆర్టిస్టులు టెక్నీషియన్స్‌ని ఫ్రూట్స్ అనుకొంటారు. తినేసి అవతల పడేస్తారు.కానీ… వాటి విత్తనాలు మళ్లీ మొలకెత్తుతాయి. మళ్లీ పండ్లే కాస్తాయి. నితిన్… మనం మళ్లీ కలుద్దాం..” అంటూ తన కోపాన్నంతా చూపించేశాడు.