https://www.youtube.com/watch?time_continue=4&v=k-xS4NwiWrc
అనుష్క భాగమతి సినిమా థియేటర్లోకి రావడానికి రెడీ అయ్యింది. సినిమాపై పాజిటివ్ వైబ్రేషన్స్ వున్నాయి. అయితే ఇది కేవలం అనుష్క పై వున్న ఒక నమ్మకమే. బాహుబలి తర్వాత అనుష్క నుండి వస్తున్న సినిమానే ఒక ఆసక్తి. ఇటివలే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపారు. ఈ ఈవెంట్ ఎదో ప్రైవేట్ పార్టీల ఒక హోటల్ లో జరిగిపోయింది. యువీ క్రియేషన్ నిర్మాణం అంటే ప్రభాస్ సొంతబ్యానర్ లాంటింది. యువీ నుండి వచ్చే ప్రతి సినిమా ఈవెంట్ లో ప్రభాస్ సెంటర్ అఫ్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడు. కానీ భాగమతి విషయంలో అది జగరలేదు. ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ వస్తాడానికి ప్రచారం జరిగింది కానీ ఆయన మాత్రం ఎందుకో హ్యాండ్ ఇచ్చేశాడు. దీంతో ఈవెంట్ కాస్త చప్పగా జరిగిపోయింది.
ఇప్పుడు ఎదో చేసి సినిమాకి మరింత బజ్ తీసుకురావాలి. ఇందుకోసం ఇప్పుడు భాగమతి కోటను వాడారు. ఈ సినిమా కోసం మూడు కోట్ల రూపాయిలు ఖర్చు చేసి ఒక కోట సెట్ ను వేసిన సంగతి తెలిసిందే. ట్రైలర్ లో ఆ కోట చూపించారు. సినిమాలో కూడా ఆ కోటే స్పెషల్ ఎట్రాక్షన్. అందుకే ఇప్పుడు ఆ కోట లోనే అనుష్క పై ఒక ప్రమోషన్ సాంగ్ ను షూట్ చేశారు. భాగమతి థీంతో సాగిన ఈ పాటలో సినిమా మేకింగ్ తో పాటు స్వీటీ స్పెషల్ గా వేసిన స్టెప్పులు కూడా చొడొచ్చు.
అనుష్క పై నమ్మకంతో బాగానే ఖర్చు చేశారు భాగమతి నిర్మాతలు. అయితే నాలుగు భాషల్లో సినిమా తీసుకురావడం అనుష్కకి మంచి శాటిలైట్ మార్కెట్ వుండటంతో భాగమతిని సేఫ్ ప్రాజెక్ట్ కిందే చూడాలి. కానీ సినిమా మరింత బజ్ క్రియేట్ చేయడనికి ప్రమోషనల్ విషయంలో భాగమతి టీమ్ మరింత శ్రమించాల్సిన అవసరం వుంది.