Dandupalyam3 Trailer
దండు పాళ్యం చూసి జనాలు షాక్ తిన్నారు. అదో దోపిడీ దొంగల ముఠా కథ. అయితే.. దొంగతనం వరకే ఆగలేదు. హత్యలు, మానభంగాలు చేశారు. అదీ క్రూరంగా. నిజ జీవితంలో ఇంత దారుణంగా జరుగుతుందా? అనేలా తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు శ్రీనివాసరాజు. ఆ బోల్డ్నెస్ చాలా మందికి నచ్చింది. దాంతో దండుపాళ్యం కన్నడలో హిట్టయ్యింది. తెలుగులోనూ మంచి డబ్బులు వచ్చాయి. ఆ తరవాత పార్ట్ 2 వచ్చింది. ఇప్పుడు పార్ట్ 3 తయారైంది. జనవరి 25న ఈ సినిమాని విడుదల చేస్తారు. ఇప్పుడు ట్రైలర్ బయటకు వచ్చింది. పార్ట్ 1, 2లలో కూడా చూపించినంత హింస, రక్తపాతం ఈ ట్రైలర్లో కనిపిస్తున్నాయి. బోల్డ్ సీన్లు బోలెడన్ని మెరుస్తున్నాయి. దండుపాళ్యం అరాచకం పీక్స్‌లో తెరపైకి తీసుకొచ్చాడు దర్శకుడు. కాలుతున్న ఇస్త్రీ పెట్టెను మహిళ వీపుకు తగిలించడం తగ్గర్నుంచి, ఆఖర్లో పూజా గాంధీ చీర పైకెత్తడం వరకూ… ఎన్ని బోల్డు సీనులో! రక్తం, బంగారం, పోలీసు బూట్లు, మంటలు తప్ప దేన్నీ కలర్లో చూపించలేదు. ఓ థీమ్ ప్రకారం ట్రైలర్ కట్ చేశాడు దర్శకుడు. `వీడికి మెడపైనున్న మాల్ ఇష్టం. నీకు మెడ కింద ఉన్న మాల్ ఇష్టం. నాకు మెడే ఇష్టం` అన్న డైలాగ్ బట్టి చూస్తే.. ఈ సినిమాలో దండుపాళ్యం ఎన్ని అరాచకాలు చేయబోతోందో అర్థం అవుతోంది. బొమ్మాళి రవిశంకర్, పూజాగాంధీ, మకరంద్ దేశ్‌పాండే, రవికాలే ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రం.. వెండి తెరపై ఇంకెంత విధ్వంసంగా ఉండబోతోందో? సున్నిత మనస్కులు, పిల్లల్ని ఇలాంటి ట్రైలర్లకు దూరంగా పెట్టడమే మంచిది!