హైదరాబాద్: తల్లిదండ్రులు సాధారణంగా తాము సాధించలేనివి తమ పిల్లలు సాధించాలని ఆశిస్తూ ఉంటారు. ఈ క్రమంలో వారు బాగా చదవాలని, మంచి మార్కులు, A+ గ్రేడ్లు తెచ్చుకోవాలని పిల్లలను పోరు పెడుతుంటారు. పిల్లలపై అలా పోరు పెడితే అది వారికి మేలుకంటే కీడే ఎక్కువ చేస్తుందని తాజా అధ్యయనంలో తేలింది. పిల్లలను బాగా చదవమని చెప్పటం వలన మంచి, చెడు రెండూ ఉంటాయని ఆ అధ్యయనంలో చెప్పారు. కొన్ని సందర్భాలలో పిల్లలలో ఇది మంచి ఫలితాలు ఇస్తుందని, కొన్ని సందర్భాలలో దుష్ఫలితాలు ఇస్తుందని పేర్కొన్నారు. పిల్లల శక్తియుక్తులను పరిగణనలోకి తీసుకోకుండా ఆచరణయోగ్యం కాని లక్ష్యాలను వారికి నిర్దేశిస్తేమాత్రం పిల్లల పనితీరు దెబ్బతింటుందని అధ్యయనం చేసిన వారు చెబుతున్నారు. తల్లిదండ్రుల లక్ష్యాలు అంచనాలను అధిగమించేకొద్దీ, అదే స్థాయిలో పిల్లల పనితీరు పడిపోతూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ అధ్యయనం ‘జర్నల్ ఆఫ్ పర్సనాలిటీ అండ్ సోషల్ సైకాలజీ’లో ప్రచురితమయింది.