జగన్మోహన్ రెడ్డికి అధికారం అందిన తర్వాత ఆ అధికారం నెత్తికెక్కడంతో దూరం చేసుకున్న వారిలో తల్లి, చెల్లి మాత్రమే కాదు స్నేహితులు కూడా ఉన్నారు. చిన్న తనం నుంచి అంటే 35 ఏళ్లుగా జగన్ కు రైట్ హ్యాండ్ గా పేరున్న దంతూలూరి కృష్ణ అలియాస్ మంగళి కృష్ణ కూడా షర్మిలకు ఓటు వేయాలని సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. దంతులూరి కృష్ణ వ్యవహారం ఇప్పుడు పులివెందులలోనూ హాట్ టాపిక్ గా మారింది.
దంతులూరి కృష్ణ పెట్టిన ఫేస్ బుక్ పోస్టు గందరగోళంగా ఉంది. పెద్దగా చదువు లేకపోవడం వల్ల తెలుగును ఇంగ్లిష్ లో రాశారు. ఆ మ్యాటర్ సారాంశం ఏమిటంటే ఈ ఎన్నికలతో జగన్ రెడ్డి పనైపోతుంది. ఎన్నికల తర్వాత ఎవరూ అంటే ఆయనతో పాటు ఆయన ముఖ్య అనుచరులు ఎవరూ కడపలో ఉండరు. తాను 35 ఏళ్లుగా జే సార్ కు పని చేస్తున్నానని కానీ తనను సింహాద్రిపురంలో తిట్టిస్తున్నారని మండిపడ్డారు. ఆయన భార్య ఓ పంచాయతీకి సర్పంచ్ గా ఉంటారు. ఆ ఊరిలో డ్రైనేజ్ పనులు చేయించే ప్రయత్నం చేస్తే తిట్టేశారట. జగన్ కు చెప్పుకునే చాన్స్ లేదు.
సింహాద్రిపురం మండల వైసీపీ ఇంచార్జ్ జగన్ పనైపోయిందని.. జగన్ జీరో అని.. ఆయనకు ఎందుకు ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారని కానీ ఆయనతో తనను తిట్టిస్తున్నారని అంటున్నార. దంతులూరి కృష్ణ కొంత కాలంగా జగన్మోహన్ రెడ్డికి దూరంగా ఉంటున్నారన్న ప్రచారం జరుగుతోంది. గతంలో కోడికత్తి దాడి జరిగినప్పుడు హైదరాబాద్ ఆస్పత్రి దగ్గర ఏర్పాట్లు ఆయనే చూసుకున్నాడు. ఈ సారి గులకరాయి డ్రామాలో ఎక్కడా కనిపించలేదు. కారణం ఏదైనా స్నేహితుడ్ని కూడా.,. జగన్మోహన్ రెడ్డి దూరం చేసుకున్నారని పులివెందులలో చెప్పుకుంటున్నారు.