నాని `దసరా` ట్రైలర్ బయటకు వచ్చింది. ఊర మాస్ సినిమా అంటే ఎలా ఉంటుందో… చెప్పడానికి ట్రైలర్ ఓ నిర్వచనంలా కనిపించింది. నాని ఇందులో మాస్ అవతార్ లో దర్శనమివ్వబోతున్నాడన్న విషయం ఫస్ట్ లుక్‌తోనే అర్థమైంది. అయితే.. ట్రైలర్లో అందుకు వంద రెట్లు ఎక్కువ కనిపించింది. ఇంత రా అండ్ రస్టిక్ సినిమా ఈమధ్య కాలంలో రాలేదన్నది వాస్తవం. ప్రతీ ఫ్రేములోనూ దర్శకుడి తాలుకూ ఇంటెన్స్ కనిపించింది. కథలో ఎమోషన్స్, పాత్రల మధ్య ఘర్షణ ఇవన్నీ ఆవిష్కృతమయ్యాయి. నానికి నెవర్ బిఫోర్ క్యారెక్టర్ ఇది. ట్రైలర్ లో ఆకట్టుకొన్న విషయాలు వెండి తెరపై ఏ మేరకు హైలెట్ అవుతాయి? అనేది ఇప్పుడే చెప్పలేం కానీ… ప్రస్తుతానికైతే దసరా ట్రైలర్ టాక్ ఆఫ్ ది టౌన్. ఈమధ్య కాలంలో మాస్ సినిమా వచ్చి చాలా కాలమైంది. అందుకే `దసరా` ఏమాత్రం క్లిక్ అయినా వసూళ్ల వర్షం కురుస్తుంది.
అయితే.. ఈ సినిమా విషయంలో నిర్మాత ఓ తప్పు చేశాడు. సినిమా షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఏపీ, తెలంగాణ హక్కుల్ని రూ.24 కోట్లకు చదలవాడ శ్రీనివాస్ కు అవుట్ రేట్ కి అమ్మేశాడు. ఆ తరవాత చదవవాడ రూ.26 కోట్లకు దిల్ రాజు చేతిల్లో పెట్టాడు. దిల్ రాజు ఈ సినిమాకి ఇప్పుడు రూ.32 కోట్లకు క్యాష్ చేసుకొన్నాడు. అంటే.. ప్రస్తుతానికి నిర్మాత 6 కోట్లు అనవసరంగా పోగొట్టుకొన్నట్టే. అయితే తెలుగు తప్ప మిగిలిన భాషల హక్కుల్నీ… నిర్మాత తన దగ్గరే పెట్టుకోవడం విశేషం. సౌత్ లో తయారైన మాస్సినిమాలకు నార్త్ లో ఈమధ్య మంచి గిరాకీ ఏర్పడింది. దసరా ఏమాత్రం బాగున్నా.. నార్త్ తో మంచి వసూళ్లు వస్తాయి. అదంతా నిర్మాతకు బోనస్సే. పైగా నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో మరో రూ.50 కోట్లు వచ్చాయి. సో.. నిర్మాత ప్రస్తుతానికి హ్యాపీ. నార్త్ లోనూ దసరా తడాఖా చూపిస్తే..కనక వర్షమే.