ఫరెగ్జాంపుల్… మన బందువులో, మిత్రులో ఎవరో ఒకరు ఆసుపత్రిల్లో చికిత్స పొందుతున్నారనుకుందాం, వారిని పరామర్శించడానికి ఇంటినుంచి బయలుదేరతాం. మధ్యలో ట్రాఫిక్ జాం అవుతుంది. ఓ అరగంటసేపు నిరీక్షించాల్సి వస్తుంది. ఈ లోగా వారు ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయ్యి ఇంటికి వెళ్లారు అనే కబురు మనకు అందుతుంది. అంతేనా అక్కడితో వెనుదిరిగి ఇంటికి వచ్చేస్తామా, లేదా అవతలి వారిని ఇంటికి వెళ్లిఅయినా సరే పరామర్శించి వద్దాం అనే ముందుకి సాగిపోతామా, ఈ ప్రశ్నకు ఎవ్వరైనా సమాధానం చెప్పగలరు. ఒకసారి మిత్రుడి పరామర్శకు అంటూ బయలుదేరిన తర్వాత పరామర్శ పూర్తిచేసే వస్తాం తప్ప ఆస్పన్రతినుంచి డిశ్చార్జి అయ్యారని వెనుదిరగడంఅంటూ జరగదు. కానీ మెగాస్టార్ తీరు మాత్రం వేరు. సగం దూరం వెళ్లాక ఆయన నిశ్చింతగా మరో ఆలోచన లేకుండా వెనక్కు తిరిగి వచ్చేయగలరు. ఈ విషయంలో దాసరినారాయణరావుకు ఉన్న ఆలోచనకూడా చిరంజీవికి లేదా అని అనిపించేలా ముద్రగడ పరామర్శకు వెళ్లిన చిరంజీవి ఆపని చేయకుండానే తిరిగి వచ్చేయడం ఇప్పుడు రకరకాల విమర్శలకు దారి తీస్తోంది.
ముద్రగడ పద్మనాభం నిరాహారదీక్ష నాలుగోరోజుకు చేరుకున్నతర్వాత విపక్ష పార్టీలకు చెందిన నాయకులందరు కూడా ఎగబడి ఆయనను పరామర్శించడానికి కిర్లంపూడి వెళ్లడానికి క్యూ కట్టడం అందరికీ తెలిసిన సంగతే. ప్రముఖ కాపు వర్గానికి నాయకుడైన దాసరినారాయణరావు కిర్లంపూడి పరామర్శకు వెళ్తుండగా పోలీసులు ఆయనను దారిలోనే అడ్డుకున్నరు. రాజమహేంద్రవరంలో దాసరిని నిలువరించారు. అక్కడి నుంచి ఆయనను ముందుకు వెళ్లనివ్వలేదు. కొన్ని గంటల పాటు ఆయనను అక్కడే ఆపేశారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకు చెందిన చిరంజీవి, రఘువీరారెడ్డి అండ్ కోకూడా కిర్లంపూడి పరామర్శకు వెళ్లడానికి ద్వారంపూడి విమానాశ్రయానికి రీచ్ అయ్యారు. పోలీసులు వారిని విమానాశ్రయం నుంచి కదలకుండా నిర్భందించేయడం జరిగింది. కిర్లంపూడి వెళ్లడానికి వీల్లేదంటూ అక్కడా సెలబ్రీటీలు వెల్లడం మూలనా మరింతగా పరిస్తితులు ఉద్రిక్తంగా మారే అవకాశం ఉందంటూ పోలీసులు వారిని అక్కడే ఆపేశారు. దీని పట్ల చిరంజీవి తదితరులు నిరసన వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే ఇటు ద్వారంపూడి లో చిరంజీవి అండ్ కో, అటు రాజమహేంద్రవరంలో దాసరినారాయణరావు పోలీసులు నిర్బందంలో ఉండగానే అక్కడ ముద్రగడ పద్మనాభం దీక్ష విరమింపచేయడంకూడా పూర్తైపోయింది.
పరామర్శకు బయలు దేరిని వాళ్లు నిరాహర దీక్ష విరమించినంత మాత్రాన వెనక్కు వచ్చేయాలా ఈ విషయంలో మాత్రం నాయకులు భిన్నాభిప్రాయాలు, భిన్నమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాసరినారాయణరావు తన నిర్భందాన్ని సడలించిన తర్వాత కిర్లంపూడి వరకు వెళ్లి ముద్రగడతో మాట్టాడి, ఆయన దీక్షకు సంఘీభావం తెలియజేసి, ఆయన లక్షానికి మద్దతుగా ఉంటాననే విషయాన్ని తెలియజేసి తిరిగి వచ్చారు. కానీ చిరంజీవి, రఘువీరారెడ్డి తదితరులకు మాత్రం ఆ మాత్రం ఆలోచనా కూడా రాలేదేమో. దీక్ష విరమించేశాడు గనుక ఇక తాము వెళ్లి ఎందుకు పరామర్శించడం అనుకున్నారెమో ఎమో తెలియడంలేదు. వాళ్లు ద్వారంపూడి నుంచి తిరిగి ప్రత్యేక విమానంలో హైదరాబాద్కు వెళ్లిపోయారు. దీక్షలో ఉంటే నాలుగోరోజు వరకు ఆయన ఆరోగ్యం పతనమై పోయి ఉంటే పరామర్శ చేస్తాం తప్ప, ఆయన తిరిగి కోలుకుని దీక్ష విరమించేసి ఉంటే ఇక పరామర్శ ఎందుకు అనే అభిప్రాయంతో చిరంజీవి రఘువీరారెడ్డి తదితరులు వచ్చారా.అని జనం ఇప్పుడు విమర్శిస్తున్నారు.