సుమంత్ సినిమా నరుడా – డోనరుడా సినిమా విడుదలకు ముందు ఊహించని హై డ్రామా సాగింది. ఈ సినిమా విడుదల ఆపేస్తూ… ఓ వ్యక్తి కోర్టు నుంచి ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొన్నాడు. నరుడా నిర్మాతల్లో ఒకరైన సుధీర్ … గత ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన సమస్య.. ఈ సినిమాకి చివరి క్షణాల్లో చుట్టుకొంది. కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో ఈసినిమా శుక్రవారం విడుదల అవ్వదేమో అనుకొన్నారంతా. అయితే.. చివరి క్షణాల్లో దాసరి నారాయణ రావు జోక్యంతో ఈ సమస్య సద్దుమణిగిందని టాక్. రూ.1.75 కోట్ల పాత బాకీ వసూలు చేసుకోవడానికి ఓ బయ్యర్ సుధీర్‌పై కోర్టులో పిటీషన్ వేసి.. స్టే ఆర్డరు తెచ్చుకొన్నాడు. ఆ ఆర్డర్ సాయింత్రం ఆరింటికి నిర్మాతలకు అందింది. అప్పటికప్పుడు ఈ ఇష్యూ సెటిల్ చేసుకొందామని ప్రయత్నిస్తే… స్టే ఆర్డర్ తెచ్చుకొన్న వ్యక్తి తన సెల్ ఫోన్ స్విచ్చాప్ చేసి అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. దాంతో.. చిత్రబృందం శుక్రవారం ఉదయం కోర్టులో మరో పిటీషన్ వేసి.. రిలీజ్‌కి క్లియరెన్స్ తెచ్చుకోవాలని ప్రయత్నించింది. శుక్రవారం సినిమా విడుదల కాకపోతే.. ఆర్థికంగా చాలా నష్టపోతామని భావించిన సుప్రియ.. దాసరిని కలసి… ఈ వ్యవహారంపై మాట్లాడరని, దాసరి ప్రమేయంతో.. ఈ సినిమా విడుదలకు అడ్డంకులు తొలగిపోయినట్టు తెలుస్తోంది.