ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు మళ్లీ ఆసుపత్రి పాలయ్యారు. ఇటీవల ఆయన అనారోగ్యం పాలైన సంగతి తెలిసిందే. రెండు నెలలు ఆసుపత్రిలో ఉండి మార్చి చివరి వారంలో ఆయన డిశ్చార్జ్ అయ్యారు. గడిచిన 5 నెలల్లో రెండు సార్లు దాసరికి శస్త్ర చికిత్స జరిగింది. ఇటీవల గ్యాస్టిక్ బెలూన్ సర్జరీనీ డాక్టర్లు విజయవంతంగా పూర్తి చేశారు. ఇటీవల తన స్వగృహంలో పుట్టిన రోజునీ జరుపుకొన్నారు దాసరి. అయితే… వారం రోజుల క్రితం ఆయన మళ్లీ ఆస్వస్థతకు గురయ్యారని తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన కిమ్స్‌లో చికిత్స తీసుకొంటున్నార్ట. దాసరి ఐసీయూలో ఉన్నారని, ఎవ్వరినీ అనుమతించడం లేదని, కేవలం కుటుంబ సభ్యులు, ఒకరిద్దరు సహాయకులు మాత్రమే అక్కడ ఉన్నారని తెలుస్తోంది. దాసరి పరిస్థితి విషమంగానే ఉందని డాక్టర్లు కూడా ధృవీకరించినట్టు సమాచారం అందుతోంది.