రీమేక్ సినిమాలపై ఈమధ్య దాసరి నారాయణరావుకీ మక్కువ పెరిగింది. ఆమధ్య అరిమతంబి సినిమాని ఎర్రబస్సుగా మలిచారు. అదో డొక్కుబస్సులా మారింది. తమిళ సినిమా నేరమ్ హక్కుల్ని కొని రెండేళ్లు తన దగ్గరే ఉంచుకొన్నారు. తనయుడు అరుణ్‌బాబుతో ఆ సినిమా తీయాలని, కొడుక్కి ఓ హిట్టివ్వాలని తెగ ప్లానింగులు వేశారు. కాస్టింగు, డైరెక్టరు అన్నీ ఓకే అయ్యాయి. అయితే ఎందుకనో… ఆ సినిమా పట్టాలెక్కలేదు. నేరమ్ రీమేక్ రైట్స్ దాసరి దగ్గరున్నాయని… ఏకే ఎంటర్టైన్ మెంట్స్, సందీప్ కిషన్.. ఆయన చుట్టూ తిరిగారు. పావలాకి అర్థరూపాయి ఇచ్చి.. ఆ సినిమా రైట్స్‌ని తిరిగి తమ పేరమీద రాయించుకొన్నారు. అదే.. ఇప్పుడు రన్ పేరుతో వచ్చింది.
ఈ సినిమా రిజల్ట్ చూసి దాసరి ఇప్పుడు హ్యాపీగా ఫీలై ఉంటారు. హమ్మయ్య.. నేను తీయలేదు.. అని. ఎప్పుడో రెండేళ్ల క్రితం వచ్చిన సినిమా ఇది. అప్పుడే తేసేసి ఉంటే.. బాగుండేది. అలాంటి కథల్ని లేట్‌గా తీసుకొస్తే ఎలా..? ఆ రిజల్ట్ ఎలా ఉంటుందో.. సందీప్ కిషన్‌కి అక్షరాలా అర్థమై ఉంటుంది. ఆ విధంగా నేరమ్ చేయకుండా.. దాసరి సేఫ్ అయ్యారన్నమాట.