పవన్ కల్యాణ్ కథానాయకుడిగా దాసరి నారాయణరావు నిర్మాతగా ఓ సినిమా తెరకెక్కుతోంది అనగానే టాలీవుడ్ షాకయ్యింది. నిజంగా ఎవ్వరూ ఊహించని కాంబినేషన్ ఇది. దాసరి కూడా ‘పవన్‌తో సినిమా చేస్తున్నా’ అని చెప్పడంతో ఆ వార్త టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. అయితే ఆ ప్రకటన బయటకు వచ్చి దాదాపు రెండేళ్లు కావొస్తోంది. అయితే ఇప్పటి వరకూ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. భవిష్యత్తులో ఉంటుందన్న గ్యారెంటీ కూడా లేదు. దీనంతటికీ కారణం దాసరి నారాయణరావు అలసత్వమే అని తెలుస్తోంది. ఈ సినిమా చేయడానికి పవన్ రెడీగానే ఉన్నాడట. అయితే దాసరి మాత్రం ‘చూద్దాం.. చేద్దాం’ అంటూ కాలక్షేపం చేస్తున్నట్టు తెలుస్తోంది. మొన్నటి వరకూ వవన్ గురించి కథలు వెదికే పనిలోపడిన దాసరి, ఇప్పుడు ఆ ప్రయత్నాలూ మానుకొన్నారని తెలుస్తోంది. దాన్ని బట్టి చూస్తే ఈ ప్రాజెక్టు నుంచి దాసరే కావాలని డ్రాప్ అయినట్టు అనుకోవొచ్చు. నిజానికి త్రివిక్రమ్ – పవన్ ల సినిమాకి దాసరి నిర్మాతగా వ్యవహరిస్తారనుకొన్నారు. అయితే దాసరి అందుకు సముఖంగా లేరట. ‘వచ్చే యేడాది సినిమా చేద్దాం…’ అంటూ చెబుతూ వస్తున్నార్ట. దాంతో పవన్ కూడా కాస్త అసహనానికి గురైనట్టు టాక్. భవిష్యత్తులో దాసరి – పవన్ కాంబినేషన్లో సినిమా ఉండొచ్చు, ఉండకపోవొచ్చు.. అని దాసరి కాంపౌండ్ వర్గాలే సమాచారం అందించాయి. సో… ఈ సినిమాపై ఆశలు పెట్టుకోవడం తప్పేనన్నమాట.