వివేకానందరెడ్డి హత్య కేసులో సాక్షుల్ని ప్రభావితం చేయకూడదన్న షరతు మీద అవినాష్ రెడ్డికి బెయిల్ మంజూరు అయింది. అయితే అసలు కేసునే తారుమారు చేసేందుకు ప్రయత్నించారని తాజాగా వెల్లడి అవుతోంది. దస్తగిరిపై పలు కేసులు పెట్టిన పోలీసులు జైల్లో పెట్టారు. ఆ సమయంలో ఆయనను దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు బెదిరించారు. ఈ విషయంపై కోర్టును ఆశ్రయించాడు దస్తగిరి. 2023 అక్టోబర్ కడప సెంట్రల్ జైల్లో ఉన్న సమయంలో దస్తగిరిని ప్రలోభాలకు గురి చేసి బెదిరించడంపై ఇప్పుడు పోలీసులు మొత్తం వ్యవహారాన్ని వెలుగులోకి తేనున్నారు.
శివశంకర్ రెడ్డికుమారుడు దేవిరెడ్డి చైతన్య రెడ్డి తో అప్పటి జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ ను ప్రశ్నించనున్నారు. అప్రూవర్ గా మారిన దస్తగిరిని రివర్స్ అవ్వాలని సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టాలని కడప సెంట్రల్ జైల్లో దస్తగిరికి 20 కోట్లు ఇస్తామంటూ ప్రలోభపెట్ఠిన చైతన్య రెడ్డి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. ఇప్పటికే చైతన్యరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలు్సోతంది. సిఐ ఈశ్వరయ్య, డిఎస్పీ నాగరాజు లను కూడా ప్రశ్నించనున్నారు. ఈ అంశంపై పోలీసుల నివేదిక .. అవినాష్ రెడ్డి. బెయిల్ రద్దు పిటిషన్ సుప్రీంకోర్టులో విచారణకు వచ్చినప్పుడు సమర్పించే అవకాశం ఉంది.
వివేకా హత్య కేసు తేలడం లేదు. ప్రస్తుతం న్యాయపరమైన అంశాల్లో ఇరుక్కుంది. సుప్రీంకోర్టు ఇచ్చిన విచారణ గడువు ముగిసింది. దాన్ని పొడిగించలేదు. కానీ పిటీషన్లు మాత్రం ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తున్నాయి. దస్తగిరిని బెదిరించిన కేసులో ఇతర వివరాలను బయట లాగి.. మొత్తంగా కేసులో కదలిక తీసుకు రావడం ఖాయంగా కనిపిస్తోంది.