జగన్ రెడ్డితో పెట్టుకుంటే మామూలుగా ఉండదని ఆయన పోలీసులు నిరూపిస్తున్నారు. దస్తగిరి కుటుంబం అంతా ఇప్పుడు జైల్లో ఉంది. ఆయన బంధువులమ్మాయి … ఓ ఎస్సీ యువకుడ్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ యువతిని బలవంతంగా తీసుకొచ్చేశారని.. దస్తగిరిపై కేసులు పెట్టారు. అట్రాసిటీ కేసులు పెట్టారు. మొత్తం ఫ్యామిలీని జైలుకు పంపారు. ఈ వ్యవహారం సంచలనంగా మారుతోంది.
దస్తగిరి వివేకా హత్య కేసులో అప్రూవర్. గతంలో దర్యాప్తు అధికారులపైనే కేసులు పెట్టారు. అలాంటిది దస్తగిరిపైన పెట్టకుండా ఉంటారా ?. ఆయనపై తరచూ కేసులు నమోదవుతున్నాయి. ఎప్పుడు అరెస్ట్ చేస్తారో నని భయపడుతూనే ఉన్నారు. తాజాగా ఆయనను జైలుకు పంపారు. దస్తగిరి ప్రాణాలకు ముప్పు ఉందన్న ఆందోళ న వ్యక్తమవుతూనే ఉంది. అందుకే.. పది మంది పోలీసులతో ఎస్కార్ట్ కల్పించారు . కానీ వారు జగన్ రెడ్డి ప్రభుత్వంలోని పోలీసులే.
వివేకా హత్య కేసు విచారణ ఆగిపోయింది. సుప్రీంకోర్టులో విచారణకు రావడం లేదు. అవినాష్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని సునీతారెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. కానీ మూడు వారాలు వాయిదా పడింది. మళ్లీ విచారణకు రాలేదు.. అవినాష్ రెడ్డి హ్యాపీగా బయటకు తిరుగుతున్నారు. అనారోగ్య కారణాలు చెప్పి ఆయన తండ్రిని బయటకు తెచ్చుకున్నారు. అంటే..ఇప్పుడు ఈ కేసులో పావులుగా మారిన వారు జైల్లో ఉన్నారు. అసలు నిందితులు మాత్రం హాయిగా బయట తిరుగుతున్నారు. కానీ అప్రూవర్ గా మారిన దస్తగిరి లాంటి వారు మాత్రం ప్రాణభయంతో వణికిపోతున్నారు.