జ‌న‌సేన‌లో చేరిక‌ల జోరు… ఈనెల 26న ముహుర్తం!

జ‌న‌సేన పార్టీలోకి చేరిక‌ల జోరు పెరుగుతోంది. వైసీపీ నేత‌ల చూపంతా ఇప్పుడు జ‌న‌సేన పార్టీ వైపే ఉంది. నియోజ‌క‌వ‌ర్గాల్లో ఉన్న ప‌రిస్థితులు, పార్టీలో ఉన్న నేత‌ల‌ను బ‌ట్టి చేరిక‌లు కొన‌సాగుతున్నాయి. చాలా నియోజ‌క‌వ‌ర్గాల్లో జ‌న‌సేన‌లోకి వైసీపీ క్యాడ‌ర్ క్యూ క‌డుతోంది.

వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని, పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారి రోశయ్య, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను జనసేనలో చేరిక‌కు ముహుర్తం ఫిక్స్ అయ్యింది. ఇప్పటికే వీరు ముగ్గురూ వేర్వేరుగా పవన్ కల్యాణ్ తో సమావేశమయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు.

విజయనగరం జిల్లాకు చెందిన వైసీపీ యూత్ జోనల్ ఇంఛార్జ్ అవనపు విక్రమ్, డా.అవనపు భావన జనసేనలో చేరబోతున్నారు. వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, ప్రకాశం జిల్లాకు చెందిన డా.యాదాల అశోక్ బాబు, నాగులుప్పలపాడు జెడ్పీటీసీ డా.యాదాల రత్నభారతి పార్టీలో చేరనున్నారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి నగర పాలక సంస్థల నుంచి పలువురు కార్పొరేటర్లు జనసేన గూటికి చేర‌బోతున్నారు.

వీరంతా ఈనెల 26వ తేదీన మంగ‌ళ‌గిరి పార్టీ ఆఫీసులో డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాణ్ స‌మ‌క్షంలో పార్టీ కండువా క‌ప్పుకోబోతున్న‌ట్లు తెలుస్తోంది.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

అశోక్ గల్లా హీరోగా సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభం

ఒక వైపు అగ్ర కథానాయకులతో భారీ చిత్రాలు చేస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యమైన చిత్రాలను నిర్మిస్తున్న ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రారంభించింది....

ఆ మూడో సినిమా ఏమిటి శేష్‌..?!

కెరీర్‌ని చాలా ప‌ద్ధ‌తిగా నిర్మించుకొంటున్న హీరోల్లో అడ‌విశేష్ ముందు వ‌రుస‌లో ఉంటాడు. థ్రిల్ల‌ర్‌, యాక్ష‌న్‌, ఫిక్ష‌న్‌... ఇలా అన్ని ర‌కాల క‌థ‌ల్నీ ఎంచుకొంటున్నాడు. త‌న నుంచి సినిమా వ‌స్తోందంటే ఓ ర‌క‌మైన అటెన్ష‌న్...

బీజేపీకి టెస్టులు పెడుతున్న కేటీఆర్ !

చంద్రబాబును తిట్టకపోతే మీరు మనుషులే కాదని బీజేపీ నేత్లని జగన్ రెడ్డి ఎలా బ్లాక్ మెయిల్ చేస్తున్నారో.. కేటీఆర్ కూడా అదే మాదిరిగా బీజేపీ నేతలకు టెస్టులు పెడుతున్నారు. తాను చెప్పినట్లుగా...

జగన్ ఫర్నీచర్ ఎప్పుడు తిరిగిస్తారు ?

తిరుమల లడ్డూ వివాదంపై జగన్ రెడ్డి పెట్టిన ప్రెస్మీట్ చూసిన వారికి..గతంలో ఆయన సీఎంగా పెట్టిన ప్రెస్మీట్లు చూసిన వారికి పెద్ద తేడా కనిపించదు. ఎందుకంటే అప్పుడు ఏ సమావేశ మందిరంలో...

HOT NEWS

css.php
[X] Close
[X] Close