ఎంతకాలంగానో ఎదురుచూస్తున్న జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు వచ్చేస్తున్నాయి. జనవరి మొదటి వారంలో ఎన్నికల షెడ్యూల్ ప్రకటించి, జనవరి 23వ తేదీన ఎన్నికలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. తద్వారా సంక్రాంతి పండుగకు ఆంధ్రా వెళ్లి వచ్చే జంట నగరాలలో ప్రజలు, అయ్యప్ప స్వామి మొక్కు తీర్చుకోవడానికి శబరిమలై వెళ్లి వచ్చే భక్తులకు ఓటు హక్కు వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.
జి.హెచ్.ఎం.సి.ఎన్నికల కోసం వార్డుల రిజర్వేషన్ ప్రక్రియ కూడా అధికారులు పూర్తి చేసారు. ఈసారి మొత్తం 150 సీట్లలో సగం సీట్లను మహిళకు రిజర్వు చేసారు. మొత్తం 150 సీట్లలో బీసీలకు-50, ఎస్టీలకు-2, ఎస్సీలకు-10, జనరల్-44 అన్-రిజర్వుడ్-44 సీట్లను కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం నోటిఫికేషన్ జారీ చేసింది.