పరిస్థితులు సవ్యంగా వుండివుంటే పాన్ ఇండియా సినిమాలు ట్రిపులార్, రాధే శ్యామ్ ఈపాటికి థియేటర్లో ఉండేవి. కానీ కరోనా మళ్ళీ విజ్రుభించడం, కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్, పాక్షిక లాక్ డౌన్ లోకి వెళ్ళడంతో పాన్ ఇండియన్ టార్గెట్ గా తెరకెక్కిన ట్రిపులార్, రాధే శ్యామ్ వాయిదా వేయకతప్పలేదు. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు కొత్త పరిశీలిస్తున్నారు. మార్చి 18 రాధే శ్యామ్, ఏప్రిల్ 29 ట్రిపులార్. ప్రస్తుతానికి ఈ డేట్లు లాక్ చేసినట్లు తెలిసింది. మార్చి 18 థియేటర్లు లాక్ చేయమని డిస్టిబ్యుటర్లకి యువీ క్రియేషన్స్ చెప్పింది. దీనిబట్టి మార్చి 18న రాధే శ్యామ్ రావడానికి మార్గం సుగమమైనట్లే. ఏప్రిల్ 29పై ట్రిపులార్ ద్రుష్టి పెట్టింది. అయితే ఈ డేట్ ని లాక్ చేయాలా ? వద్దా అనేది మార్చి చివర్లో నిర్ణయం తీసుకునే అవకాశం వుంది. ఇప్పటికే చాలా వరకు ప్రమోషన్స్ పూర్తి చేశారు. ఒక నెల రోజుల ముందు మళ్ళీ ప్రమోషన్స్ జోరు పెంచి ట్రిపులార్ గ్రాండ్ గా థియేటర్ లోకి పంపించాలనే ఆలోచనలో వుంది రాజమౌళి టీం.
అయితే దీనికి కూడా కండీషన్లు వున్నాయి. ఫిబ్రవరి చివరికల్లా పాన్ ఇండియా వైజ్ గా పరిస్థితులు బావుంటే రాధే శ్యామ్ వస్తుంది. మార్చి చివరికల్లా పరిస్థితులు అనుకూలంగా వుంటే ట్రిపులార్ వస్తుంది. ఫిబ్రవరి రెండోవారం నాటి కేసులు సంఖ్య తగ్గిపోతుందని, మళ్ళీ మామూలు పరిస్థితులు నెలకొనే అవకాశం వుందని కొన్ని సర్వేలు చెబుతున్న నేపధ్యంలో ఈసారి రాధే శ్యామ్, ట్రిపులార్ థియేటర్లోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.